Monday, December 23, 2024

మరో వివాదంలో సినీ నటి ఖుష్బూ

- Advertisement -
- Advertisement -

బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల తమిళనాడులోని ఎస్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఖుష్బూ ఫ్లెక్సీలను చీపుర్లతో కొట్టింది. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్టు చేశారు.

ఇటీవల సినీ నటి త్రిషను కించపరిచేలా మన్సూర్ అలీఖాన్ మాట్లాడటాన్ని ఖుష్బూ ఖండించారు. దీనిని డిఎంకే నేత షణ్ముగ చిన్నరాజా తప్పుపట్టారు. మణిపూర్ లో మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే, బిజేపీ ఏమీ పట్టించుకోలేదని  విమర్శించారు. దీనికి ఖుష్బూ కౌంటరిస్తూ, మహిళల్ని కించపరిచేవిధంగా మాట్లాడటం సబబు కాదనీ, అలాంటి ‘చేరి భాష’ తనకు చేతకాదనీ కామెంట్ చేశారు. చేరి అనే పదం దళిత మైనారిటీలను సూచిస్తుందనీ, ఈ పదాన్ని వాడటం ద్వారా వాళ్లని ఖుష్బూ  అవమానించారని తమిళనాడు ఉద్యమ ఎన్జీఓ నీలమ్ ఫౌండేషన్ ఆరోపించింది. ఖుష్బూ వ్యాఖ్యలపై దళిత వర్గాలు కూడా భగ్గుమన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News