- Advertisement -
హైదరాబాద్: నటిమణి, నిర్మాత కృష్ణవేణి(102) కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ‘మనదేశం’ సినిమాతో ఎన్ టిఆర్ ను ఆమె సినిమా రంగానికి పరిచయం చేశారు. సంగీత దర్శకుడు ఘంటసాలకు కూడా తొలి అవకాశం ఇచ్చిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో కృష్ణవేణి జన్మించారు. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో నాటక రంగంలో ప్రవేశించారు. 1936లో అనసూయ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
- Advertisement -