Monday, January 20, 2025

ఆస్పత్రి పాలైన నటి ఖుష్బూ.. ఎందుకంటే?

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తను ఖుష్బూ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. తాను తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనితో ఆమె అభిమానులు ఆమె క్షేమం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు.

తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ ఫ్లూ లాంటి లక్షణాలను అనుభవించినప్పుడు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని ఖుష్బూ సూచించారు. ఖుష్బూ చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్న కథానాయిక. రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరిన తర్వాత, ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News