Saturday, January 11, 2025

నటి ఖుష్బూ ఇంట విషాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేవలం తెలుగు మాత్రమే కాదు ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు చనిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు తమిళ స్టార్ హీరోయిన్, తెలుగులో కూడా అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్‌ మరణించారు.

ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. మీతో కలకాలం ఉండాలని ఎంత కోరుకున్న కానీ, వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందందని,మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని భావోద్వేగ పోస్ట్ పెట్టింది  అన్నయ్య చెప్పినట్లుగా.. జీవిత ప్రయాణాన్ని దేవుడే నిర్ణయిస్తాడు. అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News