Monday, January 20, 2025

ప్రియాంక గాంధీకి పోటీగా.. వయనాడ్ బరిలో ప్రముఖ నటి?

- Advertisement -
- Advertisement -

సినీ నటి, బిజెపి నేత ఖుష్బూ మయనాడ్ ఉప ఎన్నికల బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఇటవల దేశంలో ఖాళీగా ఉన్న రెండు లోక్ సభ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్, ప్రియాంక గాంధీని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీకి పోటీగా సినీ నటి ఖుష్బూను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీకి ఆమె దీటైన పోటీ ఇస్తుందనే భావన ఆ పార్టీలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఆమెతోపాటు ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్, ఏపీ అబ్దుల్లా కుట్టి, షాన్ జార్జ్ పేర్లను కూడా బిజెపి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో తమ అభ్యర్థిని బిజెపి ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, వయనాడ్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News