టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, దివంగత భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ని ప్రేమించిన మెహ్రీన్.. ఇటీవల అతనితో ఏడడగులు నడిచేందుకు మార్చ్ 13న నిశ్చితార్థం కూడా చేసుకుంది. రాజస్థాన్‌లోని జోధ్ పూర్ విల్లాలో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. భవ్య బిష్ణోయ్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా మెహ్రీన్ వెల్లడించిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం రోజు దిగిన ఫోటోలు కూడా అభిమానులతో పంచుకుంది. దీంతో త్వరలో మెహ్రీన్ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు అందరూ భావించారు. అయితే, ఇంతలోనే భవ్య బిష్ణోయ్‌తో తన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు చెప్పి షాకిచ్చింది.
శనివారం తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని మెహ్రీన్ తెలిపింది. ”తమ నిశ్చితార్థానికి బ్రేక్ ఆఫ్ చెప్పాలని నేను, భవ్య బిష్ణోయ్ కలిసి నిర్ణయించుకున్నాము. తమ పెళ్లి విషయంలో ముందుకు వెళ్లాలనుకోవడంలేదు. ఇకపై భవ్య తోపాటు ఆతని కుటుంబంతో కూడా ఎలాంటి సంబంధం ఉండదు. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా గౌరవిస్తారని, నా ప్రైవసీకి భంగం వాటిల్లకుండా చూస్తారని కోరుకుంటున్నాను. ఇక నుంచి నా దృష్టంతా వర్క్ మీదే ఉంటుంది” అని ట్వీట్టర్ లో మెహ్రీన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం మెహ్రీన్ తెలుగులో ‘ఎఫ్ 3’ సినిమాలో మాత్రమే నటిస్తుంది.
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021
Actress Mehreen Kaur Calls off her Wedding