Monday, November 18, 2024

నిజమే.. త్వరలోనే నా పెళ్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంజాబీ ముద్దుగుమ్మ, హీరోయిన్ మెహరీన్ కౌర్ త్వరలోనేే పెళ్లి పీటలెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా మెహరీన్ స్పష్టం చేసింది. ఇటీవల మెహరీన్ పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో స్పందించిన మెహరీన్.. అవును, త్వరలో నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు పేర్కొంది. వచ్చే నెలలోనే తన నిశ్చితార్థం జరగనున్నట్లు కూడా తెలిపింది. ఇంతకీ ఈ బ్యూటీ పెండ్లాడనున్న వరుడు ఎవరనుకుంటున్నారా?.. అతనెవరో కాదు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి బజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్. వచ్చే నెల మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థం జైపూర్ లో జరగనుంది. కాగా, మెహరీన్ ప్రస్తుతం F3 సినిమాలో నటిస్తోంది.

Actress Mehreen reacts on her Marriage

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News