Monday, December 23, 2024

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతికి మేలు చేయాలి: సినీ నటి నవీనారెడ్డి

- Advertisement -
- Advertisement -

Actress Naveena Reddy planted plants

 

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్‌లో సినీ నటి నవీనారెడ్డి మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటుతున్నారన్నారు. తాను కూడా పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతికి మేలు చేయాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కి నవీనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డైరెక్టర్ సుకుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీత లకా్ష్మరెడ్డి, చిరంజీవి సతీమణి సురేఖ ముగ్గురికి నవీనారెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News