Sunday, December 22, 2024

అందమైన, పక్కింటి అమ్మాయి తరహా పాత్ర నాది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న రూల్స్ రంజన్ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రమిది. ఈనెల 6న సినిమా విడుదల నేపథ్యంలో హీరోయిన్ నేహా శెట్టి మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను సన పాత్ర పోషించాను. డీజే టిల్లు సినిమాలో రాధికలాగా సనాది స్వార్థపూరిత పాత్ర కాదు. ఆమె తిరుపతికి చెందిన సంతోషకరమైన అమ్మాయి. ఆమె సాహసోపేతమైనది, ప్రపంచాన్ని అన్వేషించాలని కోరుకుంటుంది. పాత్ర పరంగా సన గ్లామర్‌గా ఉంటుంది.

అందమై న, బబ్లీ, పక్కింటి అమ్మాయి తరహా పాత్ర నాది. దర్శకుడు రత్నం కృష్ణ ఏ సమయంలోనైనా తన నియమాలకు కట్టుబడి ఉంటారు. పర్ఫెక్ట్‌గా, ఫోకస్డ్‌గా ఉంటారు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడమే అందుకు కారణం. నటుడిగా కిరణ్ చాలా కూల్. అతను సెట్స్‌లో వినయంగా, కామ్‌గా ఉంటాడు. నేను మాత్రం పూర్తి వ్యతిరేకం. కెమెరా ముందు ఫ్రీగా ఉండాలని సెట్స్‌లో సరదాగా మాట్లాడిస్తాను. రూల్స్ రంజన్… కథ భిన్న ంగా ఉంటుంది. ఇందులో సంఘర్షణ ఉంది. కామెడీ ఉంది. ఇది రొటీన్ అబ్బాయి,- అమ్మాయి కథ కాదు. ఇది ఆకర్షణీయమైన లవ్ థీమ్‌ను కలిగి ఉంది. దానిని విభిన్నంగా మలిచారు. నా గత చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News