Thursday, January 23, 2025

గచ్చిబౌలి లో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ గచ్చిబౌలి రోడ్డులోని ఓల్డ్ హఫీజ్‌పేటలో మరో నూతన హోటల్ అందుబాటులోకి వచ్చింది. “ ది ఎలైట్ హోటల్ ”ను మంచిర్యాల ఎంఎల్‌ఏ దివాకర్ రావుతో కలిసి గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సంపత్ నంది, విరూపాక్ష దర్శకులు కార్తీక్ దండు ముఖ్య అతిథులుగా హాజరైనారు.ది ఎలైట్ హోటల్‌ను ప్రారంభించిన అనంతరం నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఈ హోటల్ ప్రారంభోత్సవానికి

రావడం సంతోషంగా ఉందని, ఈ హోటల్ చూడటానికి బాగుండడంతో పాటు ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందన్నారు. అనంతరం మంచిర్యాల ఎంఎల్‌ఏ దివాకర్ రావు మాట్లాడుతూ ఈ హోటల్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నానన్నారు. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్‌లో ది ఎలైట్ హోటల్ ప్రారంభించారని, ఈ రూమ్స్ చాలా బాగుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News