- Advertisement -
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో బాగంగా జూబ్లీహిల్స్ లోని జిఎచెంసి పార్క్ లో ‘కార్తీకదీపం’ సీరియల్ ఫేమ్ నటి నిహారిక మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. పర్యవరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం తన సహా నటులు మనోహర్, ఐశ్వర్య, దేవరాజ్ ముగ్గురికి నిహారిక గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరింది.
Actress Niharika plant saplings in Jubilee Hills Park
- Advertisement -