Saturday, December 21, 2024

గుప్పెడు బాదములు, రంగులతో హోలీని వేడుక చేసుకోండి!

- Advertisement -
- Advertisement -

Actress Nisha Ganesh about Badams on Holi Festival

మార్చి: నీటితో నింపబడిన తుపాకులు, తమ తరువాత లక్ష్యమేమిటోనంటూ ఆసక్తికరంగా చూస్తున్న బెలూన్స్‌, ముఖం నిండా పులుముకున్న రంగుల నడుమ తళుక్కున మెరిసే వజ్రాల్లా దంతాలు.. హోలీ వేళ కనిపించే అద్భుతాలు. పెద్దలు, పిల్లలు తేడా లేదు, అందరూ పరుగులు పెడుతూ, నృత్యాలు చేస్తూనే విభిన్న రకాల స్వీట్లు, పానీయాల రుచి కూడా చూస్తుంటారు. వినోదాత్మకమైన హోలీ పండుగను వేడుక చేసుకునే వేళ, ఆలోచనాత్మకంగా మన ఎంపికలను ఎందుకు చేసుకోకూడదు!? అంటే చర్మాన్ని హానికారక రసాయన రంగుల నుంచి కాపాడుకోవడం, ఆర్గారిక్‌ రంగులు వాడటం, సరైన ఆహారాన్ని తినడం, బాదములు లాంటి నట్స్‌ తీసుకోవడం లాంటివి ఆచరించడం! మెరుగైన ఆరోగ్యానికి భగవంతుడు ప్రసాదించిన వరం బాదములు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో పంచుకునేందుకు అనువైనవి కూడా బాదములు.

తమిళ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ.. ‘‘మన పండుగలలో అతి ముఖ్యమైన అంశం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం. ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే రీతిలో ఆ బహుమతులు ఉండాలి. నా వరకూ ఈ దిశగా బాదములు తొలి ప్రాధాన్యత. చక్కటి పోషకాలను ఇవి కలిగి ఉంటాయి. వీటిని పలు భారతీయ వంటకాలలో అతిసులభంగా జోడించవచ్చు. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థలకు సైతం ఇవి మద్దతునందిస్తాయి’’ అని అన్నారు.

న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణ స్వామి మాట్లాడుతూ ‘‘మహమ్మారి కాలంలో సురక్షితంగా ఉండటానికి మనమంతా ప్రయత్నించాము. మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీజన్‌ మార్పుకు ఇది సమయం కాబట్టి జలుబు, జ్వరం లాంటివి వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల మన రోగ నిరోధక వ్యవస్ధను మరింతగా వృద్ధి చేసుకోవాలి. ఈ హోలీ వేళ, స్వీట్లు ఇతర రుచులు పంచుకోవడానికి బదులుగా బాదములు లాంటి పౌష్టికాహారం పంచుకోవడం మేలైన ఎంపిక. బాదములలో జింక్‌, ఫోలేట్‌, ఐరన్‌, విటమిన్‌ ఈ , కాపర్‌ వంటివి ఉన్నాయి’’ అని అన్నారు.

ఈ హోలీ వేళ ఆలోచనాత్మకంగా మీ బహుమతుల ఎంపికచేయండి, మీ ప్రియమైన వారికి బాదములను బహుమతిగా ఇవ్వండి!

Actress Nisha Ganesh about Badams on Holi Festival

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News