Friday, January 3, 2025

జానీని అలా పిలవొద్దు: నటి పూనమ్ కౌర్

- Advertisement -
- Advertisement -

ప్రముుఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. పలుమార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ యువతి, జానీ మాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజాగా ఈ కేసుపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ కీలక కామెంట్స్ చేశారు. “ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. జానీ మాస్టర్‌పై బాధితురాలు చేసిన అత్యాచార ఆరోపణలపై సింగర్ చిన్మయి శ్రీపాద కూడా స్పందించారు. “రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా” అని ఎక్స్ లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News