Monday, December 23, 2024

చక్కటి లవ్ స్టోరీ..

- Advertisement -
- Advertisement -

Actress Priyanka Mohan About ET Movie

కన్నడ, తమిళ చిత్రాల్లో నటించిన ప్రియాంకా మోహన్ తెలుగులో నానితో ‘గ్యాంగ్ లీడర్’, శర్వానంద్‌తో ‘శ్రీకారం’ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె సూర్యతో కలిసి నటించిన ‘ఇటి’ సినిమా తెలుగు, తమిళంలో ఈనెల 10న విడుదల కానుంది. పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వర్షన్‌ను విడుదల చేస్తోంది. సినిమా విడుదలను పురస్కరించుకొని ప్రియాంకా మోహన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చక్కటి లవ్ స్టోరీ కూడా ఉంది. బాధ్యత గల పాత్ర నాది. మనం న్యాయంగా ఉంటే ఎవరికీ తలవంచాల్సిన పనిలేదనే పాయింట్‌ను ఇందులో చూపించారు. అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. హీరో సూర్య వర్సటైల్ యాక్టర్. ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఇమాన్ ఈ సినిమాకు చక్కటి బాణీలు సమకూర్చారు. ఇది కమర్షియల్ సినిమా అయినా సోషల్ మెసేజ్ ఉంది” అని అన్నారు.

Actress Priyanka Mohan About ET Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News