Sunday, December 22, 2024

కొండా సురేఖ వ్యాఖ్యలపై నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ ఒక మహిళ గురించి మంత్రి హోదాలో ఉన్న మరో మహిళ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం… నాకు ఏ రాజకీయ నాయకుడితో, ఏ రాజకీయ పార్టీతో కానీ సంబంధం లేదు…రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా నా పేరును వాడుకోవడం ఇకనైనా ఆపాలి’ అని పోస్ట్ చేశారు.

ఇదిలావుండగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో గురువారం పరువు నష్టం దావా వేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News