పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ హైలీ ఎంటర్ టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రీతూ వర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ప్రసన్న ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. కథ విన్నప్పుడు నవ్వుతూనే వున్నాను. సినిమాలో రెండు ఫీమేల్ క్యారెక్టర్స్‌కి కథలో చాలా ప్రాధాన్యత ఉంది. సెకండ్ హాఫ్‌లో నాకు, రావు రమేష్‌కి ఓ సింగిల్ టేక్ సీన్ వుంది.
ఆ రోజు షూట్ చేసినప్పుడు అవుట్ పుట్ విషయంలో అందరూ చాలా హ్యాపీ అయ్యారు. సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. రావు రమేష్ డబ్బింగ్ పూర్తి చేసి ఫోన్ చేశారు. ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. ’చాలా అద్భుతంగా చేశావు అమ్మా.. నా 16 ఏళ్ల కెరీర్‌లో అలాంటి సీన్ చూడలేదు’ అని ఆయన చెప్పడం నాకు చాలా మరచిపోలేని అనుభూతినిచ్చింది. -సినిమా ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోంది. కామెడీ, ఎమోషన్స్ హైలైట్‌గా ఉంటాయి. -ఇందులో యంగ్ కాలేజ్ గర్ల్‌గా కనిపిస్తా. సందీప్ పాత్రతో తన బంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటివరకూ చేయని క్యారెక్టర్‌లో నేను కనిపిస్తా. -హీరో సందీప్ కిషన్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. -ఇక తెలుగులో ఓ మల్టీ స్టారర్‌కు సైన్ చేశాను. అలాగే ఓ వెబ్ సిరిస్ చేశాను”అని అన్నారు.