Sunday, January 12, 2025

రూమర్స్ పై సాయిపల్లవి ఫైర్.. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటానంటూ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి ఓ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై రూమర్స్ ప్రచారం చేస్తే.. లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే, ఇంతలా సాయిపల్లవి ఆగ్రహం వ్యక్త చేసేలా.. అసలు ఆమెపై ఏం రూమర్స్‌ వచ్చాయంటే.. ప్రస్తుతం బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి కాంబినేషన్ లో రామాయణం తెరకెక్కుతోంది. ఇందులో సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. అయిత, ఈ సినిమా కోసం సాయిపల్లవి మాంసాహారం మానేశారంటూ రూమర్స్‌ వచ్చాయి. అంతేకాదు.. విదేశాలకు వెళ్లేటప్పుడు వంట వాళ్లను ఆమె తన వెంట తీసుకెళ్తారంటూ ఇటీవల ఓ మీడియా సంస్థ కథనాన్ని రాసుకొచ్చింది. దీనిపై సాయిపల్లవి స్పందిస్తూ.. ఇలాంటి చెత్త వార్తలు ఆపకుంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు.

తాజాగా ఎక్స్ లో ఆమె పోస్ట్ పెట్టారు. “నాపై చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. దాదాపు ప్రతిసారీ నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజమేదో దేవునికి తెలుసు. కానీ, నేను మౌనంగా ఉన్నాని.. నాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇక, ప్రతిస్పందించాల్సిన సమయం వచ్చింది. ఇకపై, ముఖ్యంగా నా సినిమాల విడుదలలు, ప్రకటనలు, నా కెరీర్‌లో విషయంతో నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు.. అది ఎంత పెద్ద మీడియా సంస్థ అయినా చట్టపరంగా చర్యలు ఎదర్కొవాల్సి వస్తుంది” అంటూ సాయిపల్లవి వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News