Sunday, December 22, 2024

బిజెపిలోకి నటి శోభన

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: బిజెపి నుంచి పోటీ చేస్తున్న రాజీవ్ చంద్ర శేఖర్ కు నటి శోభన మద్దతు తెలిపారు. కర్నాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన రాజీవ్ చంద్రశేఖర్ ఈసారి తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశథరూర్, సిపిఐ అభ్యర్థి పన్నయన్ రవీంద్రన్ లతో తలపడబోతున్నారు. ఈ నెల 26న కేరళలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.

కేరళలో ఏప్రిల్ 15న(సోమవారం) ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. పలుచోట్ల బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమాలకు తనకు ఆహ్వానం అందిందని నటి శోభన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News