- Advertisement -
హైదరాబాద్: కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య చేసుకున్నారు. గచ్చిబౌలిలోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి అనంతరం సినిమా, సీరియల్స్ కి శోభిత దూరంగా ఉన్నారు. శోభిత మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్రహ్మగంతు, నినిదలే, వంటి సీరియల్స్ లలో నటించారు. గచ్చిబౌలిలోని శ్రీరాంనగర్ కాలనీలో భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆమె మృతిపై అనుమానులు ఉన్నాయని ఆమె పుట్టింటివారు ఆరోపణలు చేస్తున్నారు. శవ పరీక్ష చేసిన తరువాత మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు సమాచారం.
- Advertisement -