Sunday, April 13, 2025

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న ‘బిగ్ బాస్’ ఫేం సిరి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హన్మంత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిరి హన్మంత్ మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో బాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. సిటీలో గ్రీనరి పెరగాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం తన స్నేహితులు ప్రియ, వైష్ణవి చైతన్య, శ్రీహాన్ ముగ్గురికి సిరి హన్మంత్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ విసిరారు.

Actress Siri Hanmanth Plant Saplings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News