Thursday, January 23, 2025

‘ఎఫ్ 3’ చేయడం ఛాలెజింగ్‌గా అనిపించింది

- Advertisement -
- Advertisement -

Actress Sonal Chauhan about F3 Movie

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్ 3’తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ సందడి చేయబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇక ‘ఎఫ్3’ సినిమా గురించి సోనాల్ మీడియాతో మాట్లాడుతూ.. “ఎఫ్ 3 సినిమాలో నేను చేస్తున్న పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా వుంటుంది. నా పాత్రను ట్రైలర్‌లో కూడా సీక్రెట్‌గా దాచిపెట్టాం. నా పాత్రలో ఒక ట్విస్ట్ వుంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటనేది ప్రేక్షకులు థియేటర్‌లో చూడాల్సిందే. ‘ఎఫ్ 3’లో అన్ని పాత్రలకు కథలో ప్రాధాన్యత వుంది. నా పాత్ర వరకూ వస్తే.. కథలో కీలకమైన పాత్రే. పైగా ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి. ‘ఎఫ్ 3’ లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ చేయడం ఛాలెజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే కామెడీ చేయడం అంత తేలిక కాదు.

స్టార్ హీరో వెంకటేష్‌తో కలసి పని చేయడం ఒక గౌరవం. ఆయన గొప్ప నటుడే కాదు.. గొప్ప మనిషి. సెట్స్‌లో అందరితో కలసి మాట్లాడతారు. సహనటులు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేస్తారు. వెంకటేష్ నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వరుణ్ తేజ్ చాలా పాజిటివ్ గా వుంటారు. చాలా ఫ్రెండ్లీ పర్సన్. వరుణ్ తేజ్‌తో వర్క్ చేయడం కూడా ఆనందాన్నిచ్చింది. తమన్నా, మెహ్రీన్‌లతో కలసి పని చేయడం అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. ఈ సినిమా తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. దిల్ రాజు, శిరీష్ గ్రేట్ ప్రొడ్యూసర్స్. వారి నిర్మాణంలో పని చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. ‘ఎఫ్3’ తో ఆ కోరిక తీరింది. ఇక ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’ సినిమా చేస్తున్నా. ఇందులో నాది ఫుల్ యాక్షన్ రోల్‌”’అని అన్నారు.

Actress Sonal Chauhan about F3 Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News