Sunday, December 22, 2024

సినీనటి సౌమ్యజానుకు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

సినీ నటి సౌమ్య జానుకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బంజారాహిల్స్ పీఎస్‌లో తనపై నమోదైన కేసులో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ సౌమ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత వారం కారును రాంగ్ రూట్లో నడుపుతూ ప్రధాన రహదారిపై వస్తున్న సినీ నటి సౌమ్యను ట్రాఫిక్ హోంగార్డు అడ్డుకున్నారు. దీంతో సౌమ్య కారు దిగి హోంగార్డును దూషించడంతో పాటు దాడికి యత్నించింది. హోంగార్డు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సౌమ్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల ఆధారంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే కేసులున్నాయి.

ఈ క్రమంలో పిటిషన్‌ను విచారించిన హైకోర్టు చట్ట ప్రకారం 41ఏ నోటీసులు ఇచ్చిన తర్వాతే దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ నెల 11వ తేదీలోపు దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని సౌమ్యకు సూచించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని అధికారులు అడిగిన వివరాలు తెలపాలని ఆదేశించింది. దీంతో సౌమ్య బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంపై జాను ఇటీవల మీడియాతో మాట్లాడారు ‘ఆరోజు జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పా. నేను ఎవరిపైనా దాడి చేయలేదు. జాగ్వార్ కారు కూడా నాది కాదు.. మా ఫ్రెండ్. మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు రాంగ్ రూట్లో వెళ్లింది వాస్తవమే.. నాది పొరపాటే మళ్లీ మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తా‘ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News