Sunday, December 22, 2024

హాలీవుడ్ మూవీ ఛాన్స్ కొట్టేసిన టబు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ సీనియర్ నటి టబు బంపర్ ఆఫర్ పట్టేసింది. తెలుగుతోపాటు బాలీవుడ్ లో తన గ్లామర్, నటనతో ఆకట్టకున్న టబు.. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ మూవీ సిరీస్ ‘డ్యూన్’ పార్ట్-3లో టబు నటించనున్నట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, బ్రియాన్ హెర్బర్ట్, కెవిన్ జె ఆండర్సన్ రాసిన ‘సిస్టర్‌హుడ్ ఆఫ్ డ్యూన్’ నవల ఆధారంగా ‘డూన్: ది సిస్టర్‌హుడ్’ పేరుతో ఈ సిరీస్ ను 2019లో ప్రారంభించారు. డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వంలో వచ్చిన రెండు పార్టులు సూపర్ హిట్‌గా నిలిచాయి.

ఇటీవల రాజేష్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘క్రూ’లో కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ లతో కటిసి టబు నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రూ.80 కోట్లకు పైగా వసూల్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News