Friday, December 20, 2024

నటి తమన్నాను ప్రశ్నించిన ఈడి

- Advertisement -
- Advertisement -

గువాహతి: అక్రమ ఆన్ లైన్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ లో ఐపిఎల్ మ్యాచ్ లను చూడమని నటి తమన్నా భాటియా ప్రమోట్ చేయడంపై ఈడి ఆమెను ప్రశ్నించింది. తమన్నా గువాహతిలోని ఈడి కార్యాలయానికి మధ్యాహ్నం 1.30కు చేరుకుంది. ఆమె వెంట ఆమె తల్లి కూడా వెళ్లింది. ఆమెను ఈడి చాలా సేపు ప్రశ్నించింది. బెట్టింగ్ యాప్ పై ఐపిఎల్ మ్యాచ్ లు చూడమన్నందుకు ఆమెను ఈడి పిలిచి ప్రశ్నించింది. ఫెయిర్ ప్లే అనేది ఓ బెట్టింగ్ యాప్, అది మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్ యాప్కు సబ్సిడరీ. ఈ యాప్ ద్వారా క్రికెట్, పోకర్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్ బాల్ , కార్డు గేమ్స్, ఇతర ఛాన్స్ గేమ్ లపై పందెం కాయొచ్చు. కానీ అవి అక్రమమైనవి.  ఇదివరలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ వంటి వారు యాప్ యాడ్ లో కనిపించినందుకు ఈడి ముందు హాజరై తమ వాంగ్మూలం ఇచ్చుకున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News