Monday, December 23, 2024

హీరోయిన్‌ తనూశ్రీ దత్తాకు యాక్సిడెంట్‌!

- Advertisement -
- Advertisement -

 

Tanusri Dutta

ముంబై: బాలీవుడ్‌ నటి ‘ఆషిక్‌ బనాయా ఆప్ నే’, ‘36 చైనా టౌన్‌’ చిత్రాల ఫేం తనూశ్రీ దత్తా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సోమవారం ఆమె మహాకాళ్‌ దేవాలయానికి బయలుదేరినప్పుడు,  మార్గ మధ్యలో తను ప్రయాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆమె కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేసి గాయానికి కుట్లు వేశారు. అనంతరం ఆమె దర్శనానికి వెళ్లారు. ఈ విషయాన్ని తనూశ్రీ దత్తా  ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ‘‘ఈ రోజు నా జీవితంలో సాహసోపేతమైనది. గుడికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కాలికి కొన్ని కుట్లు వేశారు. ఎలాగైతేనేం దర్శనం చేసుకున్నాను. జై  మహాకాళ్‌’’ అని పోస్ట్‌ చేశారు. తనూశ్రీదత్తా తెలుగులో ‘వీరభద్ర’ చిత్రంలో నటించారు.

Tanusri 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News