Thursday, January 23, 2025

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా సిన్హా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

Vidhya Sinha

ముంబై: ‘రజనీగంధ’(1974), ‘చోటీ సీ బాత్’ (1975), ‘పతి పత్నీ ఔర్ వో’(1978) వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నటి విద్యా సిన్హా . ఈ ప్రముఖ బాలీవుడ్  సీనియర్ నటి 71 ఏళ్ల వయస్సులో ముంబైలోని జుహూ హాస్పిటల్ కన్నుమూశారు. ఆమె మోడల్ గా తన కెరీర్ ను ఆరంభించారు. మిస్ బాంబే టైటిల్ ను కూడా అప్పట్లో ఆమె గెలుచుకున్నారు. ఆమె తొలి చిత్రం ‘రాజా కాక’(1974). ఆ సినిమా కిరణ్ కుమార్ తో కలిసి నటించారు.  ఈ నటి గత కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా విద్యా గతవారం ఆసుప్రతిలో చేరారు. మొదట ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. అనంతరం చికిత్స పొందుతూ హాస్పిటల్‌లోనే మరణించారు.

విద్యా సిన్హా జీవితం చాలా కష్టాలతో గడిచింది. ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆమె తన పక్కింట్లో ఉండే వెంకటేశ్వర్ అయ్యర్ అనే తమిళ బ్రాహ్మణుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి 1968లో జరిగింది. ఆమె 1989లో ఓ అమ్మాయిని దత్తతకు తీసుకుని పెంచుకుంది. ఆమె పేరు జాహ్నవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News