- Advertisement -
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరం సమీపంలో ఉన్న మరకత శివాలయానికి ఎంతో విశిష్టత ఉందని, మహానగరం నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి ఆలయాన్ని దర్శించుకోని మొక్కులు చెల్లించుకుంటున్నారని సినీనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పేర్కొన్నారు.
సోమవారం చందిప్ప గ్రామానికి వెళ్లి శివాలయంలో ప్రత్యేక పూజ, అభిషేకం నిర్వహించారు. అనంతరం సోమరౌతు ఉదయ్‌కుమార్ రచించిన మరకత శివాలయం చరిత్ర పుస్తకం ఆవిష్కరణ చేశారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సదానందంగౌడ్, పూజారి సాయిశి ఆమెకు చీరసారాతో ఘనంగా సన్మానించారు. ఆలయానికి ఆహ్వానించిన దయాకర్‌రాజుకు విజయశాంతి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
- Advertisement -