Wednesday, January 22, 2025

హైదరాబాద్ రెస్టారెంట్ కు టాప్ 10లో చోటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ రెస్టారెంట్ కు టాప్ 10లో చోటు

ఘుమఘుమలాడే బిర్యానీని వండి, వడ్డించడంలో హైదరాబాద్ రెస్టారెంట్లకు ఎంతో పేరు. ఆ మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం హైదరాబాద్ బిర్యానీ తిని, పరవశించిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ రెస్టారెంట్లను ఎంపిక చేసే లా లిస్ట్ అనే సంస్థ ఇండియాలోని ఉత్తమ హోటళ్ల ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో ఫలక్ నుమా పాలెస్ లో ఉన్న అదా అనే హోటల్ మూడోస్థానంలో ఉండటం విశేషం. హైదరాబాద్ వంటకాలకు అదా హోటల్ పెట్టింది పేరు.

ఇండియాలోని టాప్ టెన్ హోటళ్ల జాబితా ఇదీ:

  1. ఇండియన్ ఏక్సెంట్, న్యూఢిల్లీ.
  2. కరావల్లి, బెంగళూరు
  3. అదా, హైదరాబాద్
  4. యౌచా ముంబయి, ముంబయి
  5. డమ్ పుక్త్, న్యూ ఢిల్లీ
  6. జమావర్- లీలా ప్యాలెస్, బెంగళూరు
  7. లె సర్క్ సిగ్నేచర్ – ది లీలా ప్యాలెస్, బెంగళూరు
  8. మేగు, న్యూఢిల్లీ
  9. బుఖారా, న్యూఢిల్లీ
  10. జియా, ముంబయి
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News