Monday, January 20, 2025

సంపద చెరబట్టిన సంపన్నులు

- Advertisement -
- Advertisement -

అదానికి 1 శాతం పన్నేసినా రూ 1.79లక్షలకోట్లు

భారత్ సంపద సంపన్నులదే పెద్దఖాతా
మొత్తం సంపదలో 40 శాతం 1 శాతం సంపన్నులదే
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆక్స్‌ఫామ్ నివేదిక
బిలియనీర్లపై 5 శాతం పన్నేసినా పిల్లలందరికీ విద్య
కరోనా దశలో ధనవంతుల ఆదాయం రోజుకు రూ 3608 కోట్లు
జిఎస్‌టి వసూళ్లు ఎక్కువగా సామాన్యుల నుంచే
సంపద పన్నుల విధానం అమలు చేస్తే మేలు
ఆర్థిక మంత్రికి సంస్థ సిఇఒ సలహా

 

దావోస్ : 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతం … దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం అత్యంత సంపన్నుల ఖాతాలపరం . భారతదేశంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం వ్యక్తుల ఆధీనంలోనే దేశంలోని మొత్తం సంపదలో 40 శాతానికి పైగా హస్తగతం అయి ఉందని హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ అధ్యయనంలో వెల్లడైంది. సోమవారం ఈ సంస్థ నివేదిక వెలుగులోకి వచ్చింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల తొలిరోజున ఈ సంస్థ తమ అధ్యయనంలో భాగంగా భారతదేశ పరిస్థితిని అనుబంధంగా తెలిపింది. భారత్‌లోని సంపద అత్యధికం 1 శాతం సంపన్నులకు చెందుతుందని తెలిపిన ఈ సంస్థ తమ నివేదికలో మరిన్ని విషయాలను వెల్లడించింది.

భారత్‌లో అట్టడుగు స్థాయిలోని కోటానుకోట్ల మందికి దేశ సంపదలో కేవలం 3 శాతం వాటా ఉంటుందని తెలిపారు. భారతదేశానికి చెందిన పది మంది అత్యధిక సంపన్నులకు కనీసం 5 శాతం చొప్పున పన్నులు విధించినా దేశంలోని పిల్లలందరిని స్కూళ్లకు పంపించగలిగే ధనం సమకూరుతుందని తెలిపారు. ‘భారత్‌లో కేవలం ఒక్క బిలియనీరు గౌతమ్ అదానికి చెందిన 201721 మధ్యకాలపు లెక్కల్లోకి రాని లాభాలపై కేవలం ఒక్క శాతం పన్ను వేసినా దీని వల్ల రూ 1.79 లక్షల కోట్లు సమకూరుతాయి. దీనితో దేశంలో 50లక్షలకు పైగా భారతీయ ప్రాధమిక పాఠశాలల టీచర్లను తీసుకునేందుకు వీలేర్పడుతుంది’ అని తెలిపారు. సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ శీర్షికతో ఈ వెలువడిన ఈ నివేదికలో సంపన్నుల ఉనికి క్రమాన్ని వివరించారు. గణాంకాల క్రమంలో దీని పర్యవసానాలను విశ్లేషించారు.

భారతదేశపు బిలియనీర్ల మొత్తం సంపదపై కేవలం రెండు శాతం పన్నుపడ్డా అది దేశంలోని కోట్లాది మందికి పౌష్టికాహారాన్ని కనీసం రెండు మూడు ఏండ్ల వరకూ అయినా సమకూర్చే విధంగా కనీసం రూ 40,423 కోట్లు జమ అవుతాయి. ఇక పది మంది అత్యంత సంపన్నులైన భారతీయ శతక స్థాయి కోటీశ్వరులను ఎంచుకుని వారిపై ఏక మొత్తంలో కనీసం 5 శాతం పన్ను విధించినా ఇది దేశానికి రూ 1.37 లక్షల కోట్ల నిధిని తెచ్చిపెడుతుంది. దీనితో ఎంతైనా చేయవచ్చు అని సూచించారు. భారతదేశంలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యకలాపాలకు అంచనా వేసిన రూ 86,200 కోట్లు, ఆయుష్షు మంత్రిత్వశాఖ నిర్ధేశిత రూ 3050 కోట్లు (202223 సంవత్సరానికి) తో పోలిస్తే ఈ విధంగా వచ్చిన సంపద ఒక్కటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ఇక భారత్‌లోని అగ్రస్థానపు 100 మంది బిలియనీర్లపై కనీసం రెండున్నర శాతం పన్నులు , అది ఒన్‌టైమ్ సెటిల్మెంట్‌గా వేసినా లేదా దేశంలో పది మంది అత్యంత సంపన్నులను ఎంచుకుని 5 శాతం పన్నులు వేసినా దీని వల్ల దేశంలోని పిల్లలందరిని స్కూళ్లకు పంపించవచ్చునని తెలిపారు. భారతదేశంలోని సంపద వ్యత్యాసాలు, వర్గాల మధ్య అస్థవ్యస్థ అగాధాల గురించి తమది నాణ్యాతాయుతమైన , పరిణామాత్మకతమైన అంటే గణాంకాలతో కూడిన నివేదిక అని ఆక్స్‌ఫామ్ తెలిపింది. దేశంలో 2020 నుంచి 2022 మధ్యకాలంలో 102 నుంచి 166కు బిలియనీర్ల సంఖ్య పెరిగిందని సంస్థ నివేదికలో తెలిపారు. కరోనా దశ నుంచి దేశంలోని అత్యంత సంపన్నుల సంపదలు వాస్తవిక దశలో చూస్తే అంతకు ముందటితో పోలిస్తే దాదాపు 121 శాతం పెరిగాయని వివరించారు. రోజువారిగా చూస్తే వీరి ఆదాయం సగటున రూ 3608 కోట్లు పెరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News