Monday, January 20, 2025

మోడీతోనే మూడేళ్లలో సంపన్నుడైన అదానీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గౌతమ్ అదానీకి ప్రధాని మోడీ నుంచి దండిగా సహకారం ఉందని, దీని వల్లనే కేవలం మూడేళ్ల కాలంలోనే ఆయన ప్రపంచస్థాయిలో అత్యంత సంపన్నుల జాబితాలో చేరారని జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. సామాన్య జనంలో ఎవరైనా ఉన్నట్లుండి శక్తివంతంగా సంపన్నులు అవుతారా? అని సభికులను ప్రశ్నించారు. ఎన్నికలు , ఓట్లు ఇందుకు ఎటువంటి సునిశితమైన, సున్నితమైన విషయాలను అయినా బాగా వాడుకునేందుకు బిజెపి వెనుకాడదని, వెనుకాడలేదని పుల్వామా ఘటనతో తేటతెల్లం అయిందన్నారు.

పుల్వామా నిజాలు ప్రజలకు తెలిసి ఉంటే బిజెపి పట్ల ఏహ్యాభావం పెరిగి ఉండేదన్నారు. పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ మోడీ అదానీ బంధాన్ని వెలుగులోకి తెచ్చారని, అదానీకి రూ 20వేల కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చిందని , దీనిపై మోడీ ఏం చెబుతారని రాహుల్ ప్రశ్నించారని, మోడీ సమాధానం కోసం డిమాండ్ చేశారని, అయితే దాదాపు రెండు రోజులు పలు విషయాలపై మాట్లాడిన మోడీ అదానీ సంపద గురించి తప్ప మిగిలిన అన్ని విషయాలు మాట్లాడారని మాలిక్ తెలిపారు. అదంతా కూడా మోడీ ధనమే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News