Tuesday, November 5, 2024

ఒక్కరోజులోనే రూ. 2 వేల కోట్లు నష్టపోయిన అదానీ కంపెనీలు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదిక వెల్లడి దరిమిలా అదానీ గ్రూపు కంపెనీలు నష్టాలపాలు కావడం ఆగలేదు. గురువారం ఒక్కరోజే గౌతమ్ అదానీ యాజమాన్యంలోని అదానీ గ్రూపు రూ. 2వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది. గౌతమ్ అదానీ ఆస్తుల నికర విలువ పడిపోవడంతో కొద్ది రోజుల క్రితం వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న ఆయన గురువారం 16వ స్థానానికి దిగజారారు. అదానీ గ్రూపు షేర్లు గత ఐదు రోజులుగా దారుణంగా పతనమవుతున్నాయి. గత ఐదు రోజులల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ షేర్ల ధరలు 40 శాతానికి పైగా నష్టపోయాయి. గ్రూపులోని ఇతర కంపెనీల షేర్లు కూడా గణనీయ స్థాయిలో పతనమయ్యాయి. అదానీ గ్రూపు సెక్యూరిటీలను కొలాటరల్‌గా పెట్టుకోవడానికి క్రెడట్ సూయిస్‌తో పాటు సిటీ గ్రూపు కూడా నిరాకరించడంతో అదానీ గ్రూపు షేర్ల ధరలు దారుణంగా పతనమవుతున్నట్లు మీడియా కథనం. ప్రస్తుతానికి అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్‌మార్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, ఎన్‌డిటివి వంటి గ్రూపుకు చెందిన కంపెనీల షేర్లు అత్యంత కనిష్ఠి స్థాయికి చేరుకుంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News