Saturday, January 11, 2025

ఇపిఎఫ్‌ఒనూ వదల్లేదు

- Advertisement -
- Advertisement -

అదానీ కోసం రిటైర్మెంట్
ఫండ్ నుంచి మళ్లింపు

ఇటిఎఫ్ ద్వారా పెట్టుబడి పెడుతున్న
ఇపిఎఫ్‌ఒ అదానీ గ్రూప్
స్టాక్స్‌లో 6కోట్ల మంది డబ్బు
ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్‌తో
మోడీ సర్కార్ చెలగాటం

అదానీ కోసం రిటైర్మెంట్ ఫండ్
ఇటిఎఫ్ ద్వారా పెట్టుబడి
పెడుతోన్న ఇపిఎఫ్‌ఒ
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో
6 కోట్ల మంది డబ్బు
కార్పస్‌లో 15 శాతం
స్టాక్‌మార్కెట్‌లోకి..
ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్‌తో
మోడీ సర్కారు చెలగాటం
హిండెన్‌బర్గ్ నివేదికతో
ఇప్పటికే భారీగా దెబ్బతిన్న
అదానీ స్టాక్స్ అదానీ
స్టాక్స్‌లో ‘బందీ’లుగా మారిన
పిఎఫ్ వినియోగదారులు
మన తెలంగాణ/ హైదరాబాద్ : అదానీ కం పెనీలపై ఎవరేమన్నా మోడీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం తీరు మారడం లేదు. ఇప్పటికీ మోడీ సర్కారు అదానీ గ్రూప్ కంపెనీల పై కరుణ చూపిస్తూనే ఉంది. హిండెన్‌బర్గ్ రీ సెర్చ్ నివేదికతో అక్రమాలు, మోసాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. దీంతో దేశీయ, వి దేశీ ఇన్వెస్టర్లు కూడా అదానీ గ్రూప్ స్టాక్స్‌కు దూరంగా ఉంటున్నారు. కానీ కేంద్రం ఇవేవి పట్టించుకోకుండా అదానీ స్టాక్స్‌లో పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉంది. అవును, ప్ర భుత్వం ఇప్పటికీ అదానీ గ్రూప్‌కు చెందిన రెండు స్టాక్స్ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది.

ఈ వారంలో జ రిగే సమావేశంలో పిఎఫ్ ట్రస్టీలు ఈ విషయంపై పునరాలోచించకపోతే, పిఎఫ్ ని ధులు అదానీ స్టాక్స్‌లో సెప్టెంబర్ వరకు కొనసాగుతాయి. దేశంలోనే అతిపెద్ద రిటైర్మెంట్ ఫండ్ అయిన ఇపిఎఫ్‌ఒ (ఉద్యోగ భవిష్య నిధి సంస్థ) సంఘటిత రంగ ఉద్యోగులకు చెందిన రూ.27.73 కోట్ల నిధుల నిర్వహణ చూసుకుంటోంది. అంచనా ప్రకారం, ఇపిఎఫ్‌ఒలో దాదాపు 6 కోట్ల మంది సభ్యులు ఉ న్నారు. ఇపిఎఫ్‌ఒ తన కార్పస్‌లో 15 శాతం నిఫ్టీ50, బిఎస్‌ఇ సెన్సెక్స్ అనుసంధాన ఇటిఎఫ్(ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లో పెట్టుబడు లు పెడుతోంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసికి ఇప్పటికే నిఫ్టీ 50 అనుసంధాన ఇటిఎఫ్‌లలో 85 శాతం ఈక్విటీ పెట్టుబడులు ఉన్నాయి.

ఎల్‌ఐసి త ర్వాత రెండో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ అయిన ఇపిఎఫ్‌ఒ కూడా ఇదే దారిలో పయనిస్తోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అదానీ కేసుకు సంబంధించి జెపిసిని ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాం డ్ చేస్తున్నాయి. ఇపిఎఫ్‌ఒ నిధులను అదానీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని కాంగ్రెస్‌తో సహా ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నా యి. ఈ అంశానికి సంబంధించి రెండో విడ త బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు కూడా పా ర్లమెంట్ నడవలేదు. లోక్‌సభ మాజీ ఎంపి రాహుల్ గాంధీ మరోసారి మోడీ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు.

ఇపిఎఫ్‌వో పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లు

ది హిందూ కథనం ప్రకారం, అదానీ గ్రూప్ స్టాక్‌లలో ఇపిఎఫ్‌ఒ పెట్టుబడుల విషయంపై ప్రశ్నించగా సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ నీలం షామీ రావు స్పందించలేదు. అ దానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవద్దని ఫండ్ మేనేజర్‌లను ఆదేశించాలని, దీని వల్ల సామాన్యుల రిటైర్‌మెంట్ ఫండ్‌కు నష్టం వా టిల్లుతుందని ది హిందూ ఆయనను కోరిం ది. 2022 మార్చి నాటికి ఇపిఎఫ్‌ఒ ఎక్స్ఛేం జ్ ట్రేడెడ్ ఫండ్ ద్వారా రూ. 1.57 లక్షల కో ట్లు పెట్టుబడి పెట్టింది. 2022-23లో మ రో రూ.38,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2016 సెప్టెంబర్‌లో ఇపిఎఫ్‌ఒ మొత్తం కార్పస్‌లో 10% మాత్రమే స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది, కానీ 2017 లో ఈ పరిమితిని 15 శాతానికి పెంచారు.

నిఫ్టీలో రెండు అదానీ స్టాక్స్

ఇపిఎఫ్‌ఒ నేరుగా ఏ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టకుండా ఇటిఎఫ్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో పె ట్టుబడి పెడుతుంది. అదానీ గ్రూప్ రెండు కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్ ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీలో ఉన్నాయి. అదానీ పోర్ట్ 2015 నుండి నిఫ్టీలో ఉండగా, అదా నీ ఎంటర్‌ప్రైజెస్‌ను 2022 సెప్టెంబర్ నుండి నిఫ్టీలో చేర్చారు. ఎస్‌ఎస్‌ఇ సూచీలు అదానీ గ్రూప్‌కు చెందిన ఈ రెండు స్టాక్‌లను 2023 సెప్టెంబర్ 6 వరకు నిఫ్టీ 50లో చేర్చాలని నిర్ణయించాయి.

అదానీ స్టాక్ పతనం ప్రభావం

జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ సగానికి పైగా పడిపోయాయి. ఈ పరిస్థితిలో ఇటిఎఫ్‌లో ఇపిఎఫ్‌ఒ ద్వారా పెట్టుబడిపై రాబడి తగ్గుతుంది. దీని వల్ల 2022-23కి ఇపిఎఫ్‌ఒ ద్వారా నిర్ణయించే వడ్డీ రేటును కూడా ప్రభావితం చేస్తుంది. 3 నెలల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 55 శాతం పడిపోయింది. మరోవైపు అదానీ పోర్ట్ స్టాక్ 3 నెలల్లో 23 శాతం తగ్గింది.

ఈ అంశంపై సిబిటి భేటీలో చర్చ

మార్చి 27 నుండి కేంద్ర కార్మిక మంత్రి భూ పేంద్ర యాదవ్ అధ్యక్షతన ఇపిఎఫ్‌ఒ సెం ట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సిబిటి) రెండు రోజు ల సమావేశం నిర్వహిస్తాయి. మార్చి 28న ఇపిఎఫ్ రేటును ప్రకటిస్తారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్‌ఒ) బోర్డు రెండు రోజుల సమావేశం మార్చి 27 నుండి ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు మంగళవారం వరకు కొనసాగుతుంది. ఈ సమావే శం తర్వాత కార్మిక మంత్రి ఇపిఎఫ్ రేటును ప్రకటిస్తారు. సిబిటి సభ్యులు భేటీలో ఇటిఎఫ్ ద్వారా ఫండ్ డబ్బును అ దానీ గ్రూప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే అం శా న్ని కూడా లేవనెత్తవచ్చు.ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News