Wednesday, January 22, 2025

గ్రీన్ రుణం.. కాలుష్య పరం

- Advertisement -
- Advertisement -

‘గ్రీన్ ఎనర్జీ’ వాటాల తనఖాతో అదానీ గ్రూప్ భారీగా రుణ సేకరణ
ఈ రుణాలతో ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల్లో పెట్టుబడులు
ఫిబ్రవరి 10న రిపోర్ట్‌తో వెలుగులోకి నిజాలు
నార్వే సంస్థ కెఎల్‌పి అదానీ షేర్లన్నింటినీ విక్రయిస్తోంది 
బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడి 
పునరాలోచనలో గ్లోబల్ ఇన్వెస్టర్లు 
అదానీ గ్రీన్‌స్టాక్ 70% పతనం

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ గురించి నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అదానీ గ్రూప్ తన కంపెనీల వాటాలను తాకట్టుపెట్టడం ద్వారా పెద్దమొత్తంలో రుణాలు సేకరించింది. ఈ రుణాన్ని అదానీ తమ ఆస్ట్రేలియన్ ఆధారిత బొగ్గు వ్యాపారం, గనులలో పెట్టుబడి పెట్టింది. ప్రధానంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా ఈ పెట్టుబడులు నిర్వహిస్తోందనే విషయం ఫిబ్రవరి 10న నివేదికతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇఎస్‌జి సామాజిక, పాలన) మార్కెట్ ఇన్వెస్టర్లకు మరో ముప్పు పొంచి ఉందని నివేదిక హెచ్చరించినట్లైంది. ఇప్పటికే హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్‌లో ఏర్పడిన ఆర్థిక సమస్యలు స్టాక్‌మార్కెట్‌పై పెను ప్రభావం చూపాయి.

ఈ కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు షేర్ల లో పెట్టుబడులు పెట్టడం గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నార్వేకు చెందిన అతిపెద్ద పెన్షన్ ఫండ్ కెఎల్‌పి తన వద్ద ఉన్న అదానీ గ్రీన్ లిమిటెడ్ షేర్లన్నింటినీ విక్రయించనున్నట్టు ప్రకటించింది. తనఖా రు ణాలతో ప్రపంచంలోని అత్యంత కలుషిత కార్యకలాపాలకు గ్రూప్ సహాయం చేసిందనే ఆందోళనల నేపథ్యంలో కెఎల్‌పి తన వద్ద అదానీ షేర్లను విక్రయించాలని నిర్ణయించిందని తాజాగా బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.

గ్రీన్ రెన్యూవబుల్ ముసుగులో అదానీ గ్రూప్ చౌకగా రుణాలు తీసుకొని, ఆ రుణాలను బొగ్గు గనుల వ్యాపారాలకు తరలిస్తోంది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు బ్యాంకులు చౌక రేట్లలో రుణాలిస్తే వాటిని అదానీ పర్యావరణానికి నష్టం కలిగించే బొగ్గు గనుల్లో పెట్టుబడి పెడుతున్నారు. దీంతో అదానీ గ్రూప్ చేస్తున్న రుణ మోసాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి.
– ట్విట్టర్‌లో టిసిఎం ఎంపి మెహువా మోహిత్రా

తనఖా రుణాలు ఆస్ట్రేలియా బొగ్గు గనులకు
అదానీ గ్రూప్ తన పునరుత్పాదక ఇంధన(రెన్యూవబుల్ ఎనర్జీ) సంస్థలలో వాటాలను తనఖా పెట్టడం ద్వారా పె ద్ద మొత్తంలో రుణాన్ని సేకరించినట్లు ఫిబ్రవరి 10న ఒక నివేదిక వెల్లడించింది. ఈ రుణాన్ని అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలోని కార్‌మైఖేల్ కోల్ మైన్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ పెట్టుబడి ప్రధానంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా జరుగుతోందనే విషయం వాతావరణ కార్యకర్తలకు అస్త్రంలా మారింది. దీంతో నార్వేకు చెందిన కెఎల్‌పి పెట్టుబడుల విభాగాధిపతి కిరణ్ అజీజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ విధానాలకు విరుద్ధంగా ఉండడంతో కార్‌మైఖేల్ ప్రాజెక్టుకు పరోక్షంగా పెట్టుబడులు పెట్టేందుకు వ్యతిరేకత వ్యక్తం చేశామని అన్నారు. బొగ్గుపై పెట్టుబడులు నిలిపివేసినట్లు ఆమె తెలిపారు. అందుకే ఇకపై అదానీ గ్రూప్‌లో పరోక్ష ఇన్వెస్టర్‌గా ఉండదల్చుకోలేదని వెల్లడించారు.

పునరాలోచనలో గ్లోబల్ ఇన్వెస్టర్లు
జనవరి 24న అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ షేర్లలో ఇన్వెస్టర్లు విక్రయాలు చేపట్టడం ద్వారా మోసం, మ్యానిపురేషణ్ ఆరోపణలపై బదులిచ్చారు. అయితే ఇప్పుడు బొగ్గు, గనుల్లో పరోక్షంగా పెట్టుబడులపై వాస్తవాలు వెలుగులోకి రావడం ద్వారా ఇన్వెస్టర్లు తాము తప్పు చేస్తున్నామనే విష యం తెలిసింది. పర్యావరణ అనుకూల పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాలనే ఆదర్శాలకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రూప్ చెప్పేది నిజం కాదని ఫిబ్రవరి 10 నివేదికతో గ్లోబల్ ఇన్వెస్టర్లకు తెలిసొచ్చింది. ఇఎస్‌జి లక్ష్యాలను విశ్వసించే 500 యూరోపియన్ ఫండ్‌లు అదానీ స్టాక్‌లో పెట్టుబడి పెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్లంతా ఇప్పుడు తమ పెట్టుబడులపై పునరాలోచనలో పడ్డారని తెలిపింది.

గ్రీన్ స్టాక్ 70 శాతం పతనం
అదానీ గ్రీన్ స్టాక్ ధర దాదాపు 70 శాతం పడిపోయింది. మూడో త్రైమాసిక నికర ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువ నమోదైన తర్వాత పెట్టుబడిదారుల మద్దతు లభించిందని కంపెనీ ఫిబ్రవరి 7న తెలిపింది. అయితే అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, అదానీ పోర్ట్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌లో వాటాలను విక్రయించడం ద్వారా 1.5 బిలియన్ డాలర్లను సమీకరించేందుకు ఫిబ్రవరి 16న పెట్టుబడిదారులతో చర్చలు జరిపినట్టు అదానీ గ్రూప్ పేర్కొంది. అయితే, ఈ తాజా వార్తతో అదానీ గ్రూప్ ప్రణాళికలను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News