Saturday, December 28, 2024

అదానీ గ్రూప్ @ 200 బిలియన్ డాలర్లు

- Advertisement -
- Advertisement -

ఈ మైలురాయిని చేరిన మూడో దేశీయ సంస్థ
గతంలో ఈ మార్క్‌ను చేరుకున్న టాటా, రిలయన్స్

Gautam-Adani

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 201 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. టాటా గ్రూప్, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు ఈ రికార్డును కల్గివున్నాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ కూడా 200 బిలియన్ డాలర్లు మార్కెట్ క్యాప్‌ను చేరుకుని దేశంలో మూడో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అదానీ గ్రూప్ స్టాక్‌మార్కెట్‌లో ఏడు కంపెనీలు లిస్ట్ చేసింది. ఈ కంపెనీల షేర్లు ఇటీవల కాలంలో అద్భుతమైన వృద్ధిని సాధించడంతో కంపెనీ మార్కెట్ విలువ రికార్డు స్థాయికి చేరింది. గురువారం స్టాక్‌మార్కెట్‌లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ లాభాలతో ట్రేడ్ అయింది.

దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ 201 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు సాధించాయి. టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ 320 బిలియన్ డాలర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ 237 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది కాలంలో అదానీ పవర్‌లో 157 శాతం, అదానీ టోటల్ గ్యాస్‌లో 50 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 67 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 51 శాతం, అదానీ పోర్ట్‌లో 17 శాతం వృద్ధి వచ్చింది.

ఇంకా ఈ ఏడాది లిస్టయిన అదానీ విల్మార్ షేరు 180 శాతం పెరిగింది. అదానీ గ్రూప్ ప్రస్తుతం ట్రాన్స్‌మిషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యాపారాల్లో ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు గ్రీన్ బిజినెస్‌తో పాటు ఎయిర్‌పోర్ట్, టాటా సెంటర్స్, సియోల్ మానుఫ్యాక్చరింగ్, రోడ్, డిఫెన్స్‌లోకి ప్రవేశించింది. అదానీ టోటల్ గ్యాస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి సెక్టార్లలోకి కూడా అడుగుపెట్టబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News