Wednesday, January 22, 2025

తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళాన్ని అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు

నిరంతర మద్దతు ఉంటుందని గౌతమ్ అదానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు కూడా ఉన్నారు.ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని సిఎం తెలిపారు. ఈ క్రమంలోనే అదానీ ఫౌండేషన్ నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News