Wednesday, January 22, 2025

రాష్ట్రానికి అదానీ పరిశ్రమలు

- Advertisement -
- Advertisement -

ఏరో స్పేస్ పార్క్, డేటా సెంటర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి
అన్ని వసతులు, రాయితీలు ఇస్తామని సిఎం రేవంత్ హామీ
మన తెలంగాణ/హైదరాబాద్:జాతీయ,అంతర్జాతీయం గా ప్రఖ్యాతిగాంచిన అదానీ గ్రూపు కంపెనీలు తెలంగా ణ రాష్ట్రంలో విస్తరించడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శా ఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, సీనియర్ అధికారులతో బుధవారం సచివాలయంలో భేటీ అయిన అదాని గ్రూప్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు, సిఇ ఓ కరణ్ అదానీ, అదానీ ఎయిరోస్పేస్ సిఇఓ ఆశీష్‌రాజ్‌వన్షీల ప్రతినిధి బృందంతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. తెలంగాణలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఎయిరో స్పే స్ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన పాలసీని, రాయితీలు, సబ్సిడీలు, వసతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నే తృత్వంలో అధికారులు అదానీ గ్రూపు ప్రతినిధులకు వి వరించారు.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కు అవసరమైన భూమి, విద్యుత్తు, నీరు, రోడ్లు, డ్రైనేజీ వ్య వస్థ, క్లియరెన్స్‌ల కోసం అమలులో ఉన్న సింగిల్ విం డ్ వ్యవస్థల పనితీరును రాష్ట్ర అధికారులు అదానీ గ్రుపు ప్ర తినిధి బృందానికి వివరించారు. దాంతో సంతృప్తి చెందిన కరణ్ అదానీ బృందం తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందుంటుందని అన్నారు. అంతేగాక రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటుగా డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వచ్చామని, కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సంభాషించిన తర్వాత అదానీ గ్రూపులో ఉన్న ప్రతి కంపెనీల బ్రాంచ్‌లను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఉత్సాహంగా ఉన్నామని కరణ్ అదానీ అన్నారని కొందరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొల్పుతున్న కంపెనీల పురోగతితో పాటు కొత్త కంపెనీల ఏర్పాటుపై సుధీర్ఘంగా చర్చలు జరిగాయని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధ్దంగా ఉన్నామని కరణ్ అదానీ ఎంతో సంతోషంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హామీ ఇచ్చారని తెలిపారు.

పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని, అవసరమైతే మీరు (అదానీ) నెలకొల్పబోయే కంపెనీల సాంకేతిక పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని మరికొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారని తెలిపారు. దేశంలోని ఇతర కంపెనీలే కాకుండా ప్రపంచస్థాయిలోని ఎన్నో కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌లో తమతమ కంపెనీలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని, హైదరాబాద్‌లోని కంపెనీలు, పరిశ్రమలు, ఐటి సంస్థలకు అవసరమైన స్కిల్డ్ లేబర్, నిపుణులైన పట్టభద్రులు పుష్కలంగా ఉన్నారని… ఇలా సకల సదుపాయాలకు తెలంగాణ రాష్ట్రం అనువుగా ఉందని సిఎం వివరించగా అందుకు సంపూర్ణంగా అంగీకరించిన తర్వాతనే అదాని గ్రూపు కంపెనీలు కొత్తగా స్థాపించబోయే వాటిని ఇక్కడే నెలకొల్పడానికి ఉత్సాహంగా ఉన్నామని కరణ్ అదానీ అన్నారని వివరించారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్‌రంజన్, సిఎంఓ కార్యదర్శి షానవాజ్ ఖాజిమ్, సిఎంఓ స్పెషల్ సెక్రటరి అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News