Monday, January 20, 2025

టాటాలను అధిగమించిన అదానీ గ్రూప్

- Advertisement -
- Advertisement -

Adani group overtakes Tatas

మార్కెట్ క్యాప్‌లో అగ్రస్థానం,  రెండో స్థానానికి పడిపోయిన టాటా గ్రూప్
మూడోస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్

ముంబయి : రంగంలో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ మరో మైలురాయిని అధిగమించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా, రిలయన్స్‌లను వెనక్కినెట్టి అదానీ గ్రూప్ అగ్రస్థానానికి చేరుకుంది. అంబుజా, ఎసిసి సిమెంట్ కంపెనీలను సొంతం చేసుకోవడం ద్వారా మార్కెట్ క్యాప్‌లో ప్రథమస్థానానికి చేరుకుంది.ఈ క్రమంలో టాటా గ్రూప్‌ను అధిగమించిన అదానీ గ్రూప్ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ దేశంలోనే అత్యంత విలువైన వ్యాపార గ్రూప్‌గా అవతరించింది. ఈ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.20.74లక్షల కోట్లకు చేరుకుంది. 154 ఏళ్ల టాటా గ్రూప్‌ను వెనక్కనెట్టి అదానీ గ్రూప్ తొలిస్థానంలో నిలిచింది. అంబుజా, ఎసిసితో కలిపి అదానీ గ్రూప్ మార్కెట్ మొత్తం విలువ శుక్రవారం నాటికి 22.25లక్షల కోట్లుకు చేరింది.

రెండోస్థానంలో ఉన్న టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కోట్ల వద్ద నిలిచింది. టాటా గ్రూప్ తర్వాత అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రిస్ రూ.17.07 లక్షల కోట్ల మార్కెట్ విలువతో మూడోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఎసిసి, అంబుజా సిమెంట్ లేకుండానే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.10.16లక్షల కోట్లుకు పెరిగింది. మరోవైపు ఇదేకాలంలో టాటా గ్రూప్ 2.57లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. క్రవారం స్విస్ కేంద్రంగా ఉన్న హోల్సిమ్..అదానీ గ్రూప్ విలువ 6.4 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. మార్కెట్ క్యాప్ పరంగా అదానీ గ్రూప్ అగ్రస్థానంలో ఉంటే టాటా, రిలయన్స్ తరువాత నాలుగోస్థానంలో బజాజ్ గ్రూప్, ఐదోస్థానంలో ఆదిత్య బిర్లా గ్రూప్ టాప్5లో ఉన్నాయి. వీటి తర్వాత భారతీగ్రూప్, కొటక్ మహీంద్ర గ్రూప్, ఆసియన్ పేయింట్స్ గ్రూప్, మహీంద్ర గ్రూప్, జిందాల్ ఓం ప్రకాష్ గ్రూప్ టాప్10లో నిలిచాయి.

రెండో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్
ఫోర్బ్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం శుక్రవారం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచినా.. అనంతరం మూడో స్థానానికి పరిమితమయ్యారు. రెండో స్థానంలో ఎల్‌విఎంహెచ్ వ్యవస్థాపకులు బెర్నార్డ్ అర్నాల్ట్ అతడి కుటుంబం నిలిచింది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ 269.1బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానంలో నిలవగా ఫ్రెంచ్ బిజినెస్ మాగ్నేట్ ఆర్నాల్ట్ 153.9బిలియన్ డాలర్లు, గౌతమ్ అదానీ కుటుంబం 152.2 బిలియన్ డాలర్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. కాగా అదానీ గ్రూప్‌లో అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్ అండ్ సెజ్, అదానీ పవర్, నార్త్ క్వీన్స్‌లాండ్ ఎక్‌పోర్టు టెర్నినల్, సర్గుజ రైల్‌కారిడర్‌తోపాటు అదానీ ఫౌండేషన్ ఉండగా తాజాగా అంబుజా సిమెంట్స్, ఎసిసి సిమెంట్స్ కూడా అదానీ గ్రూప్‌లో చేరాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News