Monday, January 20, 2025

అదానీ షేర్లు పతనం.. ఎల్‌ఐసి, ఎస్‌బిఐలకు రూ.78వేలకోట్ల నష్టం

- Advertisement -
- Advertisement -

అదానీ షేర్ల పతనంతో ఎల్‌ఐసి, ఎస్‌బిఐలకు రూ.78వేలకోట్ల నష్టం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించాలి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా
న్యూఢిల్లీ: గ్రూప్ షేర్ల పతనంతో ఎల్‌ఐసి, ఎస్‌బిఐ రూ.78వేల కోట్లుకు పైగా నష్టపోయాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయని శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. అదానీ గ్రూప్ షేర్ల ధరల విషయంలో అక్రమాలకు పాల్పడుతుందని రిసెర్చ్ నివేదిక ఆరోపించిన అనంతరం ఎల్‌ఐసి, ఎస్‌బిఐ అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాయని జనరల్ సెక్రటరీ సూర్జేవాలా ఆరోపించారు. ఎల్‌ఐసిలో ఉన్నది ప్రజల సంపదగా సూర్జేవాలా పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసి పెట్టుబడి రూ.77వేల కోట్ల నుంచి రూ.53వేలకు పడిపోయింది. రూ.23,500కోట్లు ఎల్‌ఐసి నష్టపోయింది. ఎల్‌ఐసి షేర్లు కూడా రూ.22,442కోట్లు నష్టపోయాయి.

ఈక్రమంలో ఇంకా ఎందుకు ఎల్‌ఐసి రూ.300కోట్లు అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెడుతోందని ప్రశ్నించారు. ఎస్‌బిఐ షేర్ల మార్కెట్ విలువ కోట్లు క్షీణించిందని వెలువడిన అనంతరం నేత సూర్జేవాలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్‌బిఐతోపాటు ఇతర బ్యాంకులు అదానీ గ్రూప్‌కు రూ.81,200కోట్లు రుణాలు ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు. ఎస్‌బిఐ ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎస్‌బిఐ లైఫ్ ఇంకా రూ.225 కోట్లు ఎందుకు అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెడుతుందనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జనవరి 24, 27న ఎస్‌బిఐ, ఎల్‌ఐసిలు రూ.78,118కోట్లు నష్టపోయాయని ఎంపి ఆరోపించారు.

ఎస్‌బిఐ, ఎస్‌బిఐ అదానీ గ్రూప్‌లో పెట్టిన పెట్టుబడి నష్టపోవడం దీనికి అదనంగా సూర్జేవాలా పేర్కొన్నారు. అయినా రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఈడీ, కారొరేట్ మినిస్ట్రీ అఫైర్స్ నేతృత్వంలోని ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐఒ), కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు స్పందించడం లేదని వరుస ట్వీట్‌లలో ధ్వజమెత్తారు. తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరాలని, ఆర్థిక మంత్రిని పదవి నుంచి తొలగించి దర్యాప్తునకు ఆదేశించాలని చేశారు.

కాగా అదానీ గ్రూప్ షేర్ల విషయంలో అవకతవకలకు పాల్పడిందని, ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించిందని నివేదిక వాణిజ్యవర్గాల్లో కలకలం రేపింది. అయితే అదానీ గ్రూప్ తమపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించింది. తమ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళుతున్న నేపథ్యంలో అపకీర్తి పాల్జేసేవిధంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News