Wednesday, January 22, 2025

అదానీ గ్రూపు షేర్లు భారీ పతనం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ప్రపంలోని అత్యంత సంపన్నులైన ఐదుగురు కుబేరుల జాబితాలో నుంచి భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేరు కనుమరుగైపోయింది. శుక్రవారం ఒక్కరోజే ఆయన నికర ఆస్తుల విలువ 20.1 బిలియన్ డాలర్లు పడిపోయింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ తాము విడుదల చేసిన నివేదికకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, తమపై తీసుకునే ఎవంటి న్యాయపరమైన చర్య అయినా నిలబడబోదని ప్రకటించిన దరిమిలా శుక్రవారం అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం కొనసాగింది. తమపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వస్తున్న హెచ్చరికలను తాము స్వాగతిస్తున్నట్లు హిండెన్‌బర్గ్ రిసెర్చ్ శుక్రవారం తన అధికార ట్విటర్ హ్యాండిల్‌లో పేర్కొంది.

తాము విడుదల చేసిన నివేదికకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, తమపై తీసుకునే చట్టపరమైన చర్యలు నిలబడబోవని కూడా ఆ సంస్థ ప్రకటించింది. అదనీ గ్రూపు మార్కెట్ మోసాలకు పాల్పడిందని, నణాంకాల అవకతవకలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రిసెర్చ్ జనవరి 24న ప్రచురించిన తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూపునకు చెందిన న్యాయ విభాగ అధిపతి జతిన్ జలంద్‌వాలా హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థపై అమెరికా, భారత్‌లో చట్టపరమైన చర్యలు తీసుకుఅంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

హిండెన్‌బర్గ్ దురుద్దేశపూరితంగా, మోసపూరితంగా, ఎటువంటి పరిశీధన లేకుండా ప్రచురించిన నివేదిక కారణంగా అదానీ గ్రూపు వాటాదారులు, పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయారని జతిన్ పేర్కొన్నారు. ఇలా ఉండగా శుక్రవారం గౌతమ్ అదానీ గ్రూపు షేర్లు 16.88 శాతం పడిపోవడంతో ఆ గ్రూపు నికర ఆస్తుల విలువ 20.1 బిలియన్ డాలర్లు క్షీణించింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఐదుగురి సరసన ఉన్న గౌతమ్ అదానీ ఆ స్థానాన్ని కోల్పోయారు. ఒక్కరోజులోనే ఆయన నాలుగవ స్థానం నుంచి ఏడవ స్థానానికి పడిపోయారు. అయితే భారత్‌లో మాత్రం ఆయన నంబర్‌వన్ కుబేరుడిగా కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News