Sunday, December 22, 2024

‘అదానీ’కి షాక్

- Advertisement -
- Advertisement -

Adani group stocks fall

 గ్రూప్ కంపెనీల షేర్లు భారీ పతనం
 లోయర్ సర్కూట్‌ను తాకిన 4 స్టాక్స్
 ప్రపంచ సంపన్నుల్లో నాలుగుకు పడిపోయిన ర్యాంక్

న్యూఢిల్లీ: అక్టోబర్ నెల మొదటి ట్రేడింగ్ సెషన్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను నిరాశపర్చింది. అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ షేర్లన్నీ నష్టాలతో ముగిశాయి. దీంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయన ర్యాంక్ నాలుగో స్థానానికి పడిపోయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లలో భారీ పతనం కనిపించింది. అదానీ పవ ర్, అదానీ విల్మార్ స్టాక్స్ పతనం తర్వాత లోయ ర్ సర్క్యూట్ ప్రారంభమైంది. సోమవారం ట్రే డింగ్ సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నష్టపోయాయి. ఈ షేరు ఒక దశ లో 10 శాతం పడిపోగా, ఆఖరికి 8.64 శాతం పతనంతో రూ.3157 వద్ద ముగిసింది. అదానీ టోటల్ గ్యాస్ 7.16 శాతం, అదానీ పోర్ట్ 4.42 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 5.05 శాతం చొప్పున నష్టపోయాయి.

అదానీ విల్మార్ స్టాక్ 5 శాతం పడిపోయింది. ఆ తర్వాత స్టాక్‌లో లోయ ర్ సర్క్యూట్ కారణంగా ట్రేడింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. అదానీ విల్మార్ ఈ సంవత్సరంలోనే స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయింది. ఈ స్టాక్ దాని పె ట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. అదానీ పవర్ స్టాక్ కూడా 5 శాతం పతనంతో ముగియగా, ఈ స్టాక్ కూడా లోయర్ స ర్క్యూట్‌ను పొందింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌ తమ్ అదానీ షేర్లు భారీగా పతనం కావడంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయన నాలుగో స్థానానికి పడిపోయారు. 130 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆయన ఫ్రాన్స్‌కు చెందిన బెర్నా ర్డ్ ఆర్నాల్ట్ కిందకు వచ్చాడు. ఇటీవల షేర్లలో పెరుగుదల కారణంగా గౌతమ్ అదానీ ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే.

638 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను కొనసాగిస్తున్నాయి. గతవారం ఆఖరి రోజు భారీ లాభాలతో ముగిసినా మళ్లీ మార్కెట్లు డీలాపడ్డాయి. సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఎక్కువగా మొగ్గుచూపారు. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 638 పాయింట్లు నష్టపోయి 56,789 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 207 పా యింట్లు కోల్పోయి 16,887 పాయింట్ల వద్ద స్థి రపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారీగా 9 శా తం పతనం కావడంతో నిఫ్టీ ఇండెక్స్‌పై ప్రభావం చూపింది. ఆ తర్వాత ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్, హిందాల్కో, టాటా క న్జూమర్ ప్రోడక్ట్, హెచ్‌యుఎల్, కోటక్ మ హీంద్రా బ్యాంక్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ షేర్లు 2 నుంచి 6 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. మరోవైపు ఒఎన్‌జిసి, సిప్లా, కోల్ ఇండి యా, డా.రెడ్డీస్ ల్యాబ్, బిపిసిఎల్, దివీస్ ల్యాబ్స్, ఎయిర్‌టెల్ లాభాలను నమోదు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News