Sunday, December 22, 2024

అదానీ షేర్లు నేడు ఢమాల్!

- Advertisement -
- Advertisement -

ముంబై : నేడు స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు 265 బిలియన్ డాలర్ల (రూ. 2029 కోట్లు)లంచాలు ఇవ్వజూపినందుకు అమెరికాలోని బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు మోపడంతో అదానీ షేర్లు భారీగా పతనం అయ్యాయి.

సౌర విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు అదానీ గ్రూపు భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చిందని అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. అదానీ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్  షేరు విలువ 20 శాతం మేరకు పతనమైంది. అదానీ గ్రీన్ ఎనర్జీ 19.7 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 18.14 శాతం, అదానీ పవర్ 17.79 శాతం, అదానీ పోర్ట్స్ 15 శాతం మేరకు బిఎస్సీ ఎక్స్చేంజ్ లో పతనమయ్యాయి. అంబూజా సిమెంట్స్ 14.99 శాతం, ఏసిసి 14.54 శాతం, ఎన్ డిటివి 14.37 శాతం, అదానీ విల్మర్ 10 శాతం మేరకు పతనం అయ్యాయి. అదానీకి చెందిన అనేక కంపెనీ షేర్లు లోయర్ సర్య్కూట్ పరిధిని తాకాయి. ఇక అదానీ మిడ్ క్యాప్ షేర్లయితే రూ. 2 లక్షల కోట్లు మేరకు ఆవిరయిపోయాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News