Monday, December 23, 2024

అదానీ పీఛేముడ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని ముంద్రా వద్ద అదానీ గ్రూప్ రూ.34,900 కోట్ల పెట్రోకెమికల్ ప్రాజెక్టు పనులను నిలిపివేసింది. అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణం గా ప్రాజెక్టును మూసివేయాల్సి వచ్చింది. అదా నీ గ్రూప్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పుడు గుజరాత్‌లోని ముంద్రాలో రూ.34,900 కోట్ల విలువచేసే పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ పనులను తాత్కాలికంగా నిలిపివేసింది.

అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఎఇఎల్)కు చెందిన సంస్థనే ఈ ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్, అయితే ఈ సంస్థ 2021 సంవత్సరంలో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అదానీ పోర్ట్, స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపిసెజ్) భూమిలో గ్రీన్‌ఫీల్డ్ కోల్-టుపివిసి ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. కానీ జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో అదానీ గ్రూప్‌పై అకౌంటింగ్ మోసం, స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలు చేసింది. దీని తర్వాత గౌతమ్ అదానీ కంపెనీలకు ఇప్పటివరకు సుమారు 140 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. దీంతో అదానీ గ్రూప్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి, బ్యాంకుల ఆందోళనలను తొలగించడానికి అనేక వ్యూహాలను అవలంబిస్తోంది.

అదానీ గ్రూప్ వ్యూహం ఏమిటి?

రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం అదానీ గ్రూప్ వ్యూహంగా ఉంది. దీనిలో భాగంగానే హిండెన్‌బర్గ్ ఆరోపణలపై పెట్టుబడిదారుల ఆందోళనలను పరిష్కరించడంపై కంపెనీ దృష్టిపెట్టింది. ఇప్పటికే గ్రూప్ రూ.7000 కోట్ల కోల్ ప్లాంట్ కొనుగోలును రద్దు చేసుకోగా, ఖర్చులను తగ్గించుకునేందుకు పవర్ ట్రేడ్ పిటిసిలో వాటా కోసం బిడ్ ప్లాన్‌ను కూడా వెనక్కితీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News