Wednesday, January 22, 2025

తెలంగాణలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తెలంగాణలో రూ.12.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో భేటీ అయ్యారు. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ ఆసక్తి చూపారనీ, ఈ మేరకు అవగాహన పత్రాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ హైదరాబాద్ లో ఐదువేల కోట్ల రూపాయలతో 1350 మెగావాట్ల సామర్థ్యంతో  రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది. అదానీ కానెక్స్ డేటా సెంటర్ ఐదువేల కోట్ల రూపాయలతో చందన్ వాలీలో డేటా సెంటర్ క్యాంపస్ ను నిర్మిస్తుంది. తెలంగాణాలో అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ 1400 కోట్ల రూపాయల వ్యయంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను స్థాపిస్తుంది. దీని సామర్థ్యం ఏడాదికి ఆరు మిలియన్ టన్నులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News