Wednesday, November 6, 2024

అదానీ హిండెన్‌బర్గ్ కేసు.. దర్యాప్తు పరిస్థితి ఏంటి?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అదానీ-హిండెన్‌బర్గ్ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు నియమించిన నిపుణుల కమిటీ చేసిన వివిధ సిఫారసులపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తన అభిప్రాయాలను కోర్టులో దాఖలు చేసింది. సెబీ(సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) సెబీ 41 పేజీల అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేసింది. సెబీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషాప్ మెహతా కోర్టులో హాజరయ్యారు.

కమిటీ సిఫారసులపై అభిప్రాయాలను వెల్లడించామని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం దర్యాప్తు పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తునకు ఆగస్టు 14 వరకు గడువు ఉందని మెహతా కోర్టుకు విన్నవించారు. ఆఫ్‌షోర్ ఫండ్స్ అంటే విదేశీ నిధుల కోసం రిపోర్టింగ్ నిబంధనల మార్పును మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సమర్థించింది. 2019లో నిబంధనలలో మార్పు చేసినకారణంగా ఆఫ్‌షోర్ నిధుల సరైన లబ్ధిదారుని కనుగొనడం కష్టంగా మారదని, నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే తీసుకుంటామని సెబీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News