Thursday, January 23, 2025

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో ఎప్పుడు ఏం జరిగింది?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: షేర్ల ధరలను తారుమారు చేయడం ద్వారా అదానీ గ్రూపు మోసాలకు పాల్పడిందన్న ఆరోపణలపై సెబీ చేస్తున్న దర్యాప్తు బుధవారం సమర్థించిన సుప్రీంకోర్టు ఈ కేసు దర్యాప్తును సిట్‌కు మార్చడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో అదానీ జరిగిన పరిణామ క్రమం ఈ విధంగా ఉంది.

జనవరి 2023: గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలు షేర్ల ధరలలలో మోసాలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ ఒక నివేదికను ప్రచురించింది.

ఫిబ్రవరి 2023: ఈ ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.

మార్చి 2, 2023: అదానీ గ్రూపు షేర్ల ధరలలో మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై రెండు నెలలలో దర్యాప్తు చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగుచూసిన వెంటనే అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువ 140 బిలియన్ డాలర్లు పతనం కావడంతో భారతీయ మదుపుదారుల రక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.

మే 2023: కోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికను సమర్పించింది.

మే 17, 2023: అదానీ గ్రూపు షేర్ల ధరల మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నివేదికను 2023

ఆగస్టు 14 లోగా సమర్పించాలని సెబీకి సుప్రీంకోర్టు గడువు విధించింది.

నవంబర్ 23, 2023: షేర్ల ధరలలో మోసాలకు సంబంధించి అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.

జనవరి 3, 2024: అదానీ గ్రూపు షేర్ల ధరలలో మోసాలకు పాల్పడిందన్న ఆరోపణలపై దర్యాప్తును సిట్‌కు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఆరోపణలపై సెబీ మూడు నెలల్లో తన దర్యాప్తును పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News