Saturday, November 23, 2024

అదానీ వ్యవహారం: ఓ గుణపాఠం

- Advertisement -
- Advertisement -

ప్రజలకు సంబంధించిన సంస్థల ద్వారానే అదానీ గ్రూపు సమ్మేళన ఆస్తులు ఇంతగా పెరగడానికి వీలైంది. మొదట చేసిన పని ఏమిటంటే, పెంచేసిన తమ షేర్ల విలువను సెక్యూరిటీగా చూపించి భారతీయ స్టేట్ బ్యాంక్, ఎల్‌ఐసి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి పబ్లిక్ రంగ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం. కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభించడానికి బదులు, దీర్ఘ కాలిక ప్రాతిపదికపై సేకరించిన మౌలిక సదుపాయాల పరిశ్రమకు నిధులు సమకూర్చారు. పెంచేసిన స్టాక్ విలువలతో ప్రత్యామ్నాయంగా షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలలో 75 శాతం వరకు విదేశీ బ్యాంకులు, సీమాంతర మార్కెట్ల నుంచి పొందినవే. పెద్దగా లెక్కచేయలేని చిన్న మొత్తాలను ఈక్విటీల నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి సేకరించినవే. ఈక్విటీల పరిమితికి మించి 2:1 నిష్పత్తిలో రుణాలు పొందారు. బైటపడని డబ్బా కంపెనీల (షెల్ కంపెనీలు)ను ఉపయోగించుకుని, షేర్లను తిమ్మిని బమ్మి చేసి, బమ్మిని తిమ్మిచే తాకట్టు పెట్టి రుణాలు పొందినవే.

అతి తక్కువ కాలంలో అదానీ గ్రూపు అత్యున్నత స్థితికి చేరడం, ఆ వెంటనే పాతాళానికి పడిపోవడం భారత దేశానికి ఒక గుణపాఠం కాగలదు. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలంటే దీన్ని మరింత లోతుగా పరిశీలించాలి. మార్కెట్‌లో అదానీ గ్రూపు అదృష్టం, విలువల విషయంలో దాని ఉత్థాన పతనాలను వర్ణిస్తే అదొక అద్భుతమైన కథనం అవుతుంది. కనీసం భారత దేశానికి సంబంధించినంత మటుకు చరిత్ర దీన్ని ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తుంది. అదానీ గ్రూపు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిందన్న తీవ్రమైన ఆరోపణలు బహిర్గతం కావడంతో, అద్భుతంగా పెంచుకున్న ఆస్తుల పతనాల గాలి వీచింది.
పతాక స్థాయికి ఎదిగిన వైనం

సింగపూర్‌కు చెందిన విలియవ్‌‌సుతో కలిసి అదానీ గ్రూపు 1999లో పామాయిల్ దిగుమతి వ్యాపారం మొదలు పెట్టడంతో వారి విజయపరంపర మొదలైంది. భారత దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాల పరిశమ్రల్లో అధిక భాగం అనతి కాలంలోనే అదానీ గ్రూపులోని కంపెనీల వశమయ్యాయి. ఇలా వశమైన వాటిలో ఓడ రేవులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, డేటాను నిల్వచేసే గిడ్డంగులు, రక్షణ సరఫరాల నుంచి వజ్రాల వరకు ఉన్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం అదానీ గ్రూపు ఆస్తుల విలువ 218 బిలియన్ డాలర్లు కాగా, దానిలో అదానీ సొంత వాటా 120 బిలియన్ డాలర్లకు చేరింది. మార్కెట్ అంచనా ప్రకారం వీటిలో చాలా భాగం 2020 నుంచి షేర్ ధరల పెరుగుదల వల్ల వచ్చినవే. ఇంత పెరుగుదల అనేది ఈ భూమిపైన ఎలా సాధ్యమైందనేది ఒక పెద్ద ప్రశ్న. వీరి ఆస్తుల విలువ పేకమేడలా కూలిపోవడం వెనుక ఏమున్నాయనేది చాలామంది ప్రజలకు ఎదురైన ఒక పెద్ద సందేహం.

వాస్తవ పెరుగుదల

ప్రజలకు సంబంధించిన సంస్థల ద్వారానే అదానీ గ్రూపు సమ్మేళన ఆస్తులు ఇంతగా పెరగడానికి వీలైంది. మొదట చేసిన పని ఏమిటంటే, పెంచేసిన తమ షేర్ల విలువను సెక్యూరిటీగా చూపించి భారతీయ స్టేట్ బ్యాంక్, ఎల్‌ఐసి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి పబ్లిక్ రంగ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం. కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభించడానికి బదులు, దీర్ఘ కాలిక ప్రాతిపదికపై సేకరించిన మౌలిక సదుపాయాల పరిశ్రమకు నిధులు సమకూర్చారు. పెంచేసిన స్టాక్ విలువలతో ప్రత్యామ్నాయంగా షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలలో 75 శాతం వరకు విదేశీ బ్యాంకులు, సీమాంతర మార్కెట్ల నుంచి పొందినవే.
పెద్దగా లెక్కచేయలేని చిన్న మొత్తాలను ఈక్విటీల నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి సేకరించినవే. ఈక్విటీల పరిమితికి మించి 2:1 నిష్పత్తిలో రుణాలు పొందారు. బైటపడని డబ్బా కంపెనీల (షెల్ కంపెనీలు)ను ఉపయోగించుకుని, షేర్లను తిమ్మిని బమ్మి చేసి, బమ్మిని తిమ్మిచే తాకట్టు పెట్టి రుణాలు పొందినవే. హిండెన్ బర్గ్ నివేదిక ప్రకారం ఇవ్వన్నీ అదానీ గ్రూపులోని సమ్మేళనం ద్వారా పొందినవే. ఎలాగైనా సరే తిమ్మిని బమ్మి చేసి, బమ్మిని తిమ్మి చేసి అదానీకి నిధులు సమకూర్చడానికి ఇవి రెండవ మార్గంగా ఉపయోగపడ్డాయి.

డబ్బులు సమకూర్చుకోవడంలో స్టాక్ మార్కెట్ మూడవ అవకాశంగా ఉపయోగపడింది. అనధికార అప్పుల మార్గం ద్వారా మార్జిన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆరోపణలపైన నమ్మిక కలిగి ఆ మార్గాలను బైటపెట్టినట్టయితే, అదానీకి వచ్చిన అధిక ఆదాయాలు సంపాదించడంలో ఉన్న లొసుగుల గుట్టు రట్టవుతుంది. పెరుగుతున్న టర్నోవర్‌తో పెట్టుబడులు పెట్టడం పెరిగి, లాభాలు వస్తాయి. ఈ మార్గాలన్నీ వ్యాపార సామ్రాజ్యాధినేతకు లాభాలను సమకూర్చాయి.

పునాదులు లేని ప్యాలెస్ నిజమైన విస్తరణ ఈ వ్యాపార సామ్రాజ్య భవనానికి సరైన పునాదులు లేవనేది జనవరి 24న వెలువడిన హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణతో బహిర్గతమైంది. అదానీ గ్రూపు మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. జనవరి 24 నాటికి ఉన్న అదానీ సంపద 120 బిలియన్ డాలర్ల నుంచి ఒక్క నెలలోనే 50 బిలియన్ డాలర్లకంటే తక్కువకు పడిపోవడం గమనార్హం.

నిజమైన ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఆధారంగా ఆర్థిక ఆదాయాన్ని లెక్కకట్టాలి. కానీ ఇక్కడ మార్కెట్‌లో లావాదేవీలతో ఆర్థిక ఆదాయాన్ని లెక్కగడుతున్నారు. నిజమైన అభివృద్ధిని కాకుండా స్టాక్ మార్కెట్‌లో ఆస్తుల విలువను బట్టి ఆదాయాన్ని లెక్కగడుతున్నారు. ప్రాథమిక మార్కెట్‌లో కొత్త స్టాక్‌ను అమ్మినట్టయితే, అది కొత్త పెట్టుబడులను సృష్టిస్తుంది. స్టాక్‌లో ధరలను పెంచి అదే పాత స్టాక్‌ను తిరిగి అప్రధాన మార్కెట్‌లో అమ్మినట్టయితే, నిజమైన పెట్టుబడులకు సహకారం అందదు. ఒక సంస్థకు సంబంధించిన పాత స్టాక్‌ను అప్రధాన మార్కెట్‌లో అమ్మినట్టయితే, వారి అవసరానికి అనుగుణంగా ఆయా సంస్థలు కొత్త స్టాక్‌ను ప్రవేశపెట్టినా మంచి ధర లభించదు. స్టాక్ మార్కెట్‌లో కేవలం ఎక్కువ స్టాక్ ధరలను ఆశిస్తే, డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.

గడిచిన రెండు దశాబ్దాలుగా భారత్‌లో అతి పెద్ద స్టాక్ మార్కెట్‌లోకి స్థిరంగా ముందుకు పోవడానికి అదానీ గ్రూపు తన పెట్టుబడులను ప్రవేశపెట్టింది. కానీ లాభాలు మాత్రం ఆర్థిక వలయం పరిధిలోనే ఉండిపోయినా, అప్పుడప్పుడు తన ఆర్థిక వనరులను వాటి విలువ పెరగడానికి తిరిగి పెట్టుబడిగా పెట్టడం మొదలుపెట్టింది. ఈ ఆర్థిక వలయ ప్రయాణంలో మార్కెట్‌ను నమ్మించడానికి తన ఆస్తుల విలువను పెంచుతూ, వాటి ఆదాయాన్ని పెంచు తూ, పెట్టుబడి లాభాలను కూడా పెంచింది.

పతనంలో అసమానత అసమానత, ఆర్థిక రంగంలో విచ్ఛిన్నత కొనసాగడం వల్ల నిజమైన ఆర్థిక వ్యవస్థపైన దాని ప్రభావం పడింది. ఆర్థిక రంగంలో ఉండే విలువలకు, వాస్తవ ఆర్థిక స్థితికి మధ్య ఉండే ద్వంద్వ వ్యవహారాన్ని బైటపెట్టడంలో వారి వివరణ ఒక అసత్యం. ఆర్థిక వ్యవస్థలో ఉన్న వాస్తవిక డిమాండును తగ్గించడం ద్వారా, ఆస్తుల విలువలు పడిపోవడంతో వాస్తవ రంగంపై ప్రభావం పడిడడం మొదటిది. కింది స్థాయిలో ఆర్థిక సంస్థల స్థూల విలువలు పడిపోవడం అనేది దానితో పాటు జరిగే ప్రభావం. ఇది రెండవ అంశం.

వాస్తవ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలను బహిర్గతం చేయడాన్ని ఆర్థిక స్థితితో ముడిపెడితే, ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లాగానే భారత దేశంలో కూడా ఉద్యోగాలు కోల్పోవడం పెద్ద ఎత్తున జరిగింది. అక్రమాల అదుపు? విలియం బ్లాక్ రాసిన అద్భుతమైన పుస్తకం ‘ద బెస్ట్ వే టు రాబ్ ఆర్ ఎ బ్యాంక్ ఈజ్ టు ఓన్ వన్’ (బ్యాంకును లూటీ చేసేకంటే బ్యాంకును సొంతం చేసుకోవడమే మేలు) అనే పుస్తకంలో పేర్కొన్నట్టు ఈ అక్రమాల అదుపునకు ఉండే ముఖ్య పాలనాధికారి వద్దకు కానీ, ఆర్థిక ప్రపంచాన్ని అదుపు చేసే అద్భుతమైన రక్షకుడి వద్దకు కానీ వెళదాం. ముఖ్య పాలనాధికారులు నాలుగు రకాల అధికారాలను అనుభవిస్తున్నారు. వాటిలో లోన, బైట నుంచి వచ్చే వత్తిడులను అదుపు చేయడం, తమ మిత్రుల జోలికి రాకుండా ఎవరినైనా సరే నిలువరించడం మొదటిది. వాళ్ళు లూటీ చేయడానికి ఆడిటర్ల ద్వారా సహకరింప చేయడం. కంపెనీలకు అనుకూలంగా వారి మార్కెట్ విలువలను అంచనా వేయడం అనేది రెండవది. కార్పొరేట్ పద్ధతుల ద్వారా కంపెనీల ఆస్తులను వ్యక్తిగత నిధులుగా ముఖ్య పాలనాధికారులు మార్చడం మూడవది. వారి ఏకైక శక్తి ఏమిటంటే, విదేశాల నుంచి వచ్చే సహాయానికి ప్రభావితం చేయడం నాలువది. భారత దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలకు సహకరించడానికి ఇవి సరిపోవా?

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News