Monday, December 23, 2024

అవినీతికి చిహ్నం అదానీ: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కోలార్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు సంధించారు. అదానీ అవినీతిని ఊతంగా చేసుకుని తూర్పారబట్టారు. ఇక్కడే…ఈ కోలార్ లోనే  2019లో  తొలిసారి మోడీ ఇంటిపేరును ఉటంకిస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగానే ‘క్రిమినల్ డిఫేమేషన్’ కేసులో దోషిగా తేలి పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు రాహుల్ గాంధీ.

కర్నాటకలో ఎన్నికలు ప్రకటించిన తర్వాత తొలిసారి కర్నాటకకు విచ్చేసిన రాహుల్ గాంధీ, అదానీ అంశంను తీసుకుని ప్రధాని మోడీని లక్షంగా చేసుకున్నారు. ఆయన ఇక్కడ ‘జై భారత్’ ర్యాలీలో ప్రసంగిస్తూ ‘అదానీ అవినీతికి చిహ్నం’ అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి.

‘కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సమైక్యంగా పోటీ చేస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ బహిరంగ సభలో ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కర్నాటక ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కెపిసిసి చీఫ్ డి.కె.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అయిన సిద్ధరామయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News