Saturday, November 23, 2024

పార్లమెంట్‌లో అదానీ రగడ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గురువారం అదానీ హిండెన్‌బర్గ్ అంశం పెనుదుమా రం సృష్టించింది. అదానీ కంపెనీల షేర్లకు సం బంధించిన హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు లోక్‌స భ, రాజ్యసభలలో విపక్షాలు సంఘటితంగా పట్టుబట్టాయి. జాతీయ స్థాయిలో ఆర్థిక భద్రతా అం శం పరిధిలో అదానీ వ్యవహారం ప్రస్తావనకు వ స్తోందని, దీనిపై చర్చకు వీలు కల్పించాలని, అ దానీ గ్రూప్ వ్యవహారాలపై, కంపెనీల స్టాక్‌ల ప తనం , అదానీ సంస్థలలో భారీ స్థాయి మోసాల అంశాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) ఏర్పాటు చేయాలని నిజాల నిగ్గు తేల్చాలని పేర్కొంటూ విపక్షాలు
పట్టుపట్టాయి. అదానీకి వ్యతిరేకంగా ఉభయ సభలలో పెద్ద ఎత్తున నినాదాలకు దిగాయి. దీనితో సభలు అర్థాంతరంగా గురువారం వాయిదా పడ్డాయి.ఎటువంటి చర్చ లేకుండా, తదుపరి అజెండా సాగకుండానే శుక్రవారానికి సభలు వాయిదా పడ్డాయి.

బడ్జెట్ సమావేశాలలో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ఆరంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయానికి అనుమతిని ఇచ్చారు. అయితే ముందుగా కీలకమైన అదానీ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. తమ స్థానాల నుంచి లేచి వెల్‌లోకి రావడానికి యత్నించాయి. అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక గురించి చర్చించా ల్సి ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ ఇతర పార్టీలు వాయి దా తీర్మానాలకు నోటీసులు వెలువరించాయి. అయితే స్పీకర్ వీటిని తోసిపుచ్చారు.ప్రశ్నోత్తరాల సమయం విలు వైనదని, సభా కార్యకలాపాలు సాగనివ్వాలని సూచించారు. అయితే నివేదికలోని అంశాలు అత్యంత కీలకమ ని వెల్లడవుతున్న దశలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే రీతిలో షేర్ల పతనం జరుగుతున్నందున తక్షణం దీనిపై చర్చ జరగాల్సిందే, లేదా జెపిసి దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు తెలిపాయి.దీనితో ఉభయసభల్లోనూ ముం దు మధ్యాహ్నం రెండు గంటల వరకూ సభలను వాయి దా వేశారు.

తరువాత తిరిగి సమావేశం అయిన తరువాత కూడా ఇదే పరిస్థితి ఉండటంతో సభలను శుక్రవారానికి వాయిదా వేశారు. అదానీ గ్రూప్ షేర్లలో పతనం వల్ల ఇందులో పెట్టుబడులు పెట్టిన ప్రజా సంబంధిత ఎల్‌ఐసికి ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంటూ న్యూయార్క్‌కు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించింది. దీనిని విపక్షాలు ప్రధానంగా ప్రస్తావించాయి. పోర్టులు మొదలుకుని ఇంధన సముదాయాల వరకూ అదానీ గ్రూప్ ద్వారా భారీ మోసాలు జరిగాయని పేర్కొంటూ ఈ సంస్థ నివేదిక పలు విషయాలను వెల్లడించింది. అయితే ఈ వాదనను అదానీ గ్రూప్ ఖండించింది. కల్పితం, కట్టుకథల మయం అని తిప్పికొట్టింది. లోక్‌సభలో దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లారు. నినాదాలు చేస్తూ అదానీ గ్రూప్ కార్పేరేట్ వ్యవహారాలపై చర్చ, దర్యాప్తునకు పట్టుపట్టాయి.
ప్రజల సొమ్ముతో ముడిపడిన అంశం : ఖర్గే
ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని తాము కోరుకుంటున్నామని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సమావేశాల వాయిదా అనంతరం పార్లమెంట్ ఆవరణంలోని గాంధీజీ విగ్రహం వద్ద ప్రతిపక్ష సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ అంశంపై దర్యాప్తునకు సంబంధించిన వివరాలు రోజువారీగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది భారతీయులు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ప్రమాదంలో పడేస్తూ మార్కెట్ విలువను కోల్పోతున్న కంపెనీల్లో ఎల్‌ఐసి, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల పెట్టుబడులపై చర్చించేందుకు సెక్షన్ 267 నిబంధనల ప్రకారం బిజినెస్ నోటీసులు ఇవ్వగా, దానినిన స్పీకర్ తిరస్కరించడంపై ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి ముఖ్యమైన అంశాన్ని సభ్యులు లేవనెత్తినప్పుడు చర్చకు సమయం దొరకదంటూ కేంద్రంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. కొన్ని ప్రైవేటు సంస్థలకు కేంద్రమే నిధులు సమకూరుస్తుండడం సిగ్గుచేటన్నారు. అలాగే అప్పులు ఇవ్వాలని బ్యాంకులపై ఒత్తిడి తీసుకరావడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
గుజరాత్ వ్యాపారస్తుల కోసమే మోడీ తాపత్రయం : కెకె
అదానీ షేర్ల వ్యవహారంపై జెపిసి లేదా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలని ఉభయ సభల్లో బిఆర్‌ఎస్ పార్లమెంటరీ ( రాజ్యసభ ) నాయకుడు కె.కేశవరావు, లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీడియాతో వారు మాట్లాడుతూ, అదానీ సంక్షోభంపై లోక్‌సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు వెల్లడించారు. ఆర్థిక అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరగాలని కోరామన్నారు. ఇప్పటికే అదాని షేర్లు 27 శాతం పడిపోయాయన్నారు.వ్యాపారస్తులు ప్రభుత్వ స్నేహితులుగా ఉన్నారని, అందుకే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని వారు విమర్శించారు. సభ ఆర్డర్‌లో లేదని వాయిదా వేయడం సరికాదని వారు విమర్శించారు. గుజరాత్ వ్యాపారస్తుల కోసమే ప్రధాని నరేంద్రమోడీ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు కూడగడ్డుకుని కేంద్రంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
అదానీ వ్యవహారంపై యావత్ ప్రతిపక్ష సభ్యులంతా చర్చ జరపాలని పట్టుబట్టినా కేంద్రం చర్చ జరపకుండా ఎందుకు తప్పించు కుంటుందని ప్రశ్నించారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లోనే ఈ అంశంపై చర్చించాలని నోటీస్ ఇచ్చామని, కానీ స్పీకర్ పట్టించుకోకుండా సభను వాయిదా వేయడం ఏమిటని నిలదీశారు. ఈ అంశం దేశ ప్రజలతో ముడిపడి ఉ న్నందున సత్వరమే పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అదానీ స్టాక్స్ వివాదం కావడంతో ఎల్‌ఐసి, బ్యాంకింగ్ రం గంలో పెట్టుబడులు పెట్టిన వారు, డబ్బు దాచుకున్న పేద ప్రజల్లో అభద్రతా భావం నెలకొని, ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో పూర్తి స్థాయిలో చర్చ జరపాల్సిన అవసరం ఉం దని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ ఎంపిలు జోగినపల్లి సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News