- Advertisement -
న్యూడిల్లీ: కోర్టు నిర్ణయం తీసుకునేవరకు అదానీ, హిండెన్‌బర్గ్ వ్యవహారంపై మీడియా వార్తలు రాయకుండా ఆంక్షలు విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. న్యాయవాది ఎంఎల్ శర్మ చేసిన అభ్యర్థనను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తోసిపుచ్చారు.
కాగా.. హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తు కోరుతూ దాఖలైన నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. హిండెబర్గ్ నివేదికపై సెబి, కేంద్ర హోం శాఖ దర్యాప్తు చేపట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్లలో ఒకరైన శర్మ వాదించారు.
- Advertisement -