ముంబై: అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రచ్చతో అదానీ స్థానం ప్రపంచ కుబేరుల జాబితా(టాప్ టెన్ బిలియనీర్స్) నుంచి తొలగింది. ఆయన నికర సంపద మంగళవారం మరింత కుదించుకుపోయింది. హిండెన్‌బర్గ్ ఇచ్చిన వివరాణాత్మక నివేదికతో ఆయన గ్రూప్‌కు చెందిన స్టాకులు మరింత పడిపోయాయి. ఆయన కంపెనీ స్టాకులు హై వాల్యూయేషన్ ఉన్న కారణంగా మరింతగా పడిపోయే అవకాశం ఉందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అభిప్రాయపడింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం అదానీ నికర సంపద 84.4 బిలియన్ డాలర్లు. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో అతడి ప్రస్తుత స్థానం 11.
అదానీ గ్రూప్ ఆదివారం హిండెన్‌బర్గ్ నివేదికపై ప్రతిస్పందిస్తూ ‘అది ఓ ప్రత్యేక కంపెనీపై దాడి కాదు, వృద్ధి చెందుతున్న భారత్‌పై జరిగిన ‘కాల్యూకులేటెడ్ అటాక్’ అని పేర్కొంది. దానికి హిండెన్‌బర్గ్ ట్వీట్‌తో జవాబిచ్చింది. ఏదైతేనేమి…గౌతమ్ అదానీ సంపద 15 రోజుల్లో 39 బిలియన్ డాలర్ల మేరకు హరించుకుపోయింది. జనవరి 17న 124 బిలియన్ డాలర్లు ఉన్న అతడి నెట్‌వర్త్ ఇప్పుడు 84.4 బిలియన్ డాలర్లే. అతడి సంపద విలువ తగ్గిపోవడంతో టాప్ టెన్ బిలియనీర్ల జాబితా నుంచి అతడి స్థానం తొలగింది. అయినప్పటికీ అతడు ఇప్పటికీ భారత్‌లో సంపన్నుడిగానే ఉన్నారు. అయితే ముకేశ్ అంబానీకి, అదానీకి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయింది. ఇదిలావుండగా అదానీ గ్రూప్ కంపెనీ ఎఫ్‌పిఒ సబ్‌స్క్రిప్షన్ జనవరి 27న మొదలయింది, జనవరి 31 వరకు కొనసాగనున్నది. రూ. 20000 కోట్ల ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పిఒ) కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) వద్ద అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.
Our Reply To Adani:
Fraud Cannot Be Obfuscated By Nationalism Or A Bloated Response That Ignores Every Key Allegation We Raisedhttps://t.co/ohNAX90BDf
— Hindenburg Research (@HindenburgRes) January 30, 2023